భారతీయ వైద్య సంఘం నంద్యాల శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మంగళవారం రాత్రి మధు మణి సమావేశ భవనంలో ఘనంగా నిర్వహించారు.ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గత సంవత్సర కాలంగా డాక్టర్ మధుసూదన రావు, డాక్టర్ పనిల్ అధ్యక్ష కార్యదర్శులుగా నంద్యాల ఐఎంఏ ద్వారా చేసిన 146 కార్యక్రమాలను మల్టీమీడియా ప్రజెంటేషన్ ద్వారా డాక్టర్ మధుసూదనరావు వివరించారు.
నంద్యాల ఐఎంఏ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా డాక్టర్ కె.శ్రీనివాసరావు, డాక్టర్ మహమ్మద్ రఫీ, కోశాధికారిగా డాక్టర్ హరితల తో పాటు మిగిలిన కార్యవర్గంతో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు.
నంద్యాల ఐఎంఏ మహిళా విభాగం అధ్యక్ష కార్యదర్శులుగా డాక్టర్ మాధవి డాక్టర్ సునీత డాక్టర్ శైలజలతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులతో డాక్టర్ మధుసూదనరావు ప్రమాణస్వీకారం చేయించారు.
నంద్యాల ఐఎంఏ అకాడమిక్ విభాగం ఏ.ఎం.ఎస్. అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మల్లీశ్వరి డాక్టర్ లలిత కోశాధికారి డాక్టర్ శశి కిరణ్ లతో పాటు కార్యవర్గ సభ్యులతో ఐఎంఏ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన రెడ్డి ప్రమాణం చేయించారు.
38 మంది వివిధ పదవీ బాధ్యతలను నంద్యాల ఐఎంఏ లో, 32 మంది మహిళా వైద్య విభాగం బాధ్యతలను, 15 మంది ఏఎంఎస్ విభాగ బాధ్యతలను ఈ సందర్భంగా స్వీకరించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలకు, నిరంతర వైద్య విద్యా కార్యక్రమాలకు నంద్యాల ఐ.ఎం.ఏ.కు రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉన్నదని, ఆ పేరు నిలబెట్టుకునేలా నంద్యాల ఐఎంఏ సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని, ఐక్యతతో అసోసియేషన్ ను బలోపేతం చేయాలని నూతన కార్యవర్గానికి సూచించారు.
ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శి బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ శ్రీనివాసరావు డాక్టర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ఐఎంఏ లో నూతన సభ్యులను చేర్చుకుని బలోపేతం చేస్తామని, రాష్ట్రంలో నంద్యాల ఐఏఎస్ ఉన్న ప్రతిష్టను ఇనుమడింప చేస్తామని ప్రకటించారు.
మహిళా వైద్య విభాగ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మాధవి డాక్టర్ సునీత డాక్టర్ శైలజలు మాట్లాడుతూ తమ మహిళా వైద్య విభాగం ద్వారా విస్తృతంగా వైద్య ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను ప్రజలలో నిర్వహిస్తామని, వైద్య శిబిరాలను నిర్వహించి సేవలు కొనసాగిస్తామని అన్నారు.
నంద్యాల ఐఎంఏ అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీస్
(ఏ.ఎం.ఎస్.) విభాగం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మల్లీశ్వరి డాక్టర్ లలిత తమ విభాగం ద్వారా నిరంతర వైద్య విద్యా కార్యక్రమాలను నిర్వహించి వైద్యులకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన కల్పించి తద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు.
తదుపరి నంద్యాల గత రెండు సంవత్సరాల కాలంలో వివిధ పదవులలో బాధ్యతలు నిర్వహించిన వైద్యులను నూతన కార్యవర్గం ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి, ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర పిపిడబ్ల్యూ స్కీం వైస్ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్, సీనియర్ వైద్యులు డాక్టర్ సహదేవుడు, డాక్టర్ జఫరుల్లా, డాక్టర్ వినోద్,డాక్టర్ నాగమణి, డాక్టర్ నర్మద, డాక్టర్ వసుధ, డాక్టర్ కల్పన, డాక్టర్ అరుణకుమారి, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ విజయబాబు, డాక్టర్ భార్గవ్ వర్ధన్ రెడ్డి, డాక్టర్ పెసల అశోక్ , అధిక సంఖ్యలో నంద్యాల వైద్యులు పాల్గొన్నారు.

నంద్యాల ఐఎంఏ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారంఐఎంఏ ద్వారా విస్తృత సేవా కార్యక్రమాలు చేయాలి: డాక్టర్ రవి కృష్ణ
భారతీయ వైద్య సంఘం నంద్యాల శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మంగళవారం రాత్రి మధు మణి సమావేశ భవనంలో ఘనంగా నిర్వహించారు.ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గత సంవత్సర కాలంగా డాక్టర్ మధుసూదన రావు, డాక్టర్ పనిల్ అధ్యక్ష కార్యదర్శులుగా నంద్యాల ఐఎంఏ ద్వారా చేసిన 146 కార్యక్రమాలను మల్టీమీడియా ప్రజెంటేషన్ ద్వారా డాక్టర్ మధుసూదనరావు వివరించారు. నంద్యాల ఐఎంఏ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా డాక్టర్ కె.శ్రీనివాసరావు, డాక్టర్ మహమ్మద్ రఫీ, కోశాధికారిగా డాక్టర్ హరితల తో పాటు మిగిలిన కార్యవర్గంతో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. నంద్యాల ఐఎంఏ మహిళా విభాగం అధ్యక్ష కార్యదర్శులుగా డాక్టర్ మాధవి డాక్టర్ సునీత డాక్టర్ శైలజలతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులతో డాక్టర్ మధుసూదనరావు ప్రమాణస్వీకారం చేయించారు. నంద్యాల ఐఎంఏ అకాడమిక్ విభాగం ఏ.ఎం.ఎస్. అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మల్లీశ్వరి డాక్టర్ లలిత కోశాధికారి డాక్టర్ శశి కిరణ్ లతో పాటు కార్యవర్గ సభ్యులతో ఐఎంఏ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన రెడ్డి ప్రమాణం చేయించారు. 38 మంది వివిధ పదవీ బాధ్యతలను నంద్యాల ఐఎంఏ లో, 32 మంది మహిళా వైద్య విభాగం బాధ్యతలను, 15 మంది ఏఎంఎస్ విభాగ బాధ్యతలను ఈ సందర్భంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలకు, నిరంతర వైద్య విద్యా కార్యక్రమాలకు నంద్యాల ఐ.ఎం.ఏ.కు రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉన్నదని, ఆ పేరు నిలబెట్టుకునేలా నంద్యాల ఐఎంఏ సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని, ఐక్యతతో అసోసియేషన్ ను బలోపేతం చేయాలని నూతన కార్యవర్గానికి సూచించారు. ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శి బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ శ్రీనివాసరావు డాక్టర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ఐఎంఏ లో నూతన సభ్యులను చేర్చుకుని బలోపేతం చేస్తామని, రాష్ట్రంలో నంద్యాల ఐఏఎస్ ఉన్న ప్రతిష్టను ఇనుమడింప చేస్తామని ప్రకటించారు. మహిళా వైద్య విభాగ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మాధవి డాక్టర్ సునీత డాక్టర్ శైలజలు మాట్లాడుతూ తమ మహిళా వైద్య విభాగం ద్వారా విస్తృతంగా వైద్య ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను ప్రజలలో నిర్వహిస్తామని, వైద్య శిబిరాలను నిర్వహించి సేవలు కొనసాగిస్తామని అన్నారు. నంద్యాల ఐఎంఏ అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీస్ (ఏ.ఎం.ఎస్.) విభాగం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మల్లీశ్వరి డాక్టర్ లలిత తమ విభాగం ద్వారా నిరంతర వైద్య విద్యా కార్యక్రమాలను నిర్వహించి వైద్యులకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన కల్పించి తద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు. తదుపరి నంద్యాల గత రెండు సంవత్సరాల కాలంలో వివిధ పదవులలో బాధ్యతలు నిర్వహించిన వైద్యులను నూతన కార్యవర్గం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి, ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర పిపిడబ్ల్యూ స్కీం వైస్ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్, సీనియర్ వైద్యులు డాక్టర్ సహదేవుడు, డాక్టర్ జఫరుల్లా, డాక్టర్ వినోద్,డాక్టర్ నాగమణి, డాక్టర్ నర్మద, డాక్టర్ వసుధ, డాక్టర్ కల్పన, డాక్టర్ అరుణకుమారి, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ విజయబాబు, డాక్టర్ భార్గవ్ వర్ధన్ రెడ్డి, డాక్టర్ పెసల అశోక్ , అధిక సంఖ్యలో నంద్యాల వైద్యులు పాల్గొన్నారు.

