ఎన్టీఆర్ జిల్లా నందిగామ లోని కాకాని వెంకటరత్నంకళాశాలలో ఈరోజు ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించబడింది. ఈ ప్రత్యేక సందర్భంలో ఏర్పాటు చేసిన సభకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రాయప్ప అధ్యక్షత వహించారు. ప్రిన్సిపల్ ప్రసంగం లో, కొత్త విద్యార్థినీ విద్యార్థుల ను ఉద్దేశించి, “ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యంత విలువైన కళాశాల”గా కాకాని వెంకట రత్నం కళాశాలను గుర్తిస్తూ, ఈ కళాశాలలో చదివిన చాలా మంది విద్యార్థులు వివిధ ఉన్నత స్థానాలలో స్థిరపడ్డారని తెలిపారు. కళాశాలలో ఉన్న అన్ని సమగ్ర సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.
అంతేకాక, జిల్లా లోని అతి పెద్ద లైబ్రరీ, జిమ్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ విభాగాలు లభ్యమని, వీటిని ఉపయోగిం చడం ద్వారా విద్యార్థులు సులభంగా ఉద్యోగ అవకాశా లను పొందవచ్చనివివరించారు. అలాగే, అత్యంత నైపుణ్యం కలిగిన అధ్యాపకులు కళాశాల లో ఉన్నారని, వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.సభలో, కళాశాల లోని వివిధ విభాగాల అధ్యాప కులు మరియు విద్యార్థులు క్రమశిక్షణ, విద్యా విషయాలపై వివరాలు ఇచ్చారు. విద్యార్థులు క్రమపద్ధతిగా కళాశాలకు హాజరు కావడం, సబ్జెక్టులు సమయానికి పూర్తి చేయడం, అంకితభావంతో సామాజిక సంక్షేమానికి పాటుపడే విధంగా విద్యను అభ్యసించడం అవసర మని స్పష్టంగా సూచించారు.
ప్రిన్సిపల్ విద్యార్జనతోపాటు విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని, నైతిక విలువలను పాటిస్తూ, అసాంఘిక కార్యకలాపాల నుండి దూరంగా ఉండి కళాశాల పేరు మరియు తల్లిదండ్రుల ఆకాంక్షలను నిలబెట్టాలనని సూచించారు.భోజనానంతరం, విద్యార్థినీ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అదరగొట్టారు. అలాగే ఈ కార్యక్రమంలో ఫైనల్ ఇయర్ విద్యార్థుల ఫేర్వెల్ కూడా నిర్వహించబడింది. ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు, కళా శాల వదిలి బయలుదేరే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యులు:
తెలుగు శాఖ అధ్యక్షులు: డాక్టర్ చాట్ల కిషోర్ ఇంగ్లీష్ శాఖ అధ్యక్షులు: పాల్ బాబు, వాసుదేవరావు రసాయన శాస్త్ర విభాగాధ్యక్షులు: ఎం.ఎం.వి.వై. స్వామి వాణిజ్య శాస్త్ర విభాగాధ్యక్షులు: డాక్టర్ కొండ్రు రమేష్ బాబు భౌతిక శాస్త్ర శాఖ అధ్యక్షులు: డాక్టర్ పులి రజనీకాంత్ ఇంకా కిషోర్ బాబు, అప్పా రెడ్డి, మధుసూదన్ రావు
క్రమవద్ధంగా సాగిన ఈ కార్యక్ర మం, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలతో ముగిసింది.

నందిగామ లోని కాకాని వెంకటరత్నం కళాశాలలో ఘన ఫ్రెషర్స్ డే కార్యక్రమం
ఎన్టీఆర్ జిల్లా నందిగామ లోని కాకాని వెంకటరత్నంకళాశాలలో ఈరోజు ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించబడింది. ఈ ప్రత్యేక సందర్భంలో ఏర్పాటు చేసిన సభకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రాయప్ప అధ్యక్షత వహించారు. ప్రిన్సిపల్ ప్రసంగం లో, కొత్త విద్యార్థినీ విద్యార్థుల ను ఉద్దేశించి, “ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యంత విలువైన కళాశాల”గా కాకాని వెంకట రత్నం కళాశాలను గుర్తిస్తూ, ఈ కళాశాలలో చదివిన చాలా మంది విద్యార్థులు వివిధ ఉన్నత స్థానాలలో స్థిరపడ్డారని తెలిపారు. కళాశాలలో ఉన్న అన్ని సమగ్ర సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. అంతేకాక, జిల్లా లోని అతి పెద్ద లైబ్రరీ, జిమ్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ విభాగాలు లభ్యమని, వీటిని ఉపయోగిం చడం ద్వారా విద్యార్థులు సులభంగా ఉద్యోగ అవకాశా లను పొందవచ్చనివివరించారు. అలాగే, అత్యంత నైపుణ్యం కలిగిన అధ్యాపకులు కళాశాల లో ఉన్నారని, వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.సభలో, కళాశాల లోని వివిధ విభాగాల అధ్యాప కులు మరియు విద్యార్థులు క్రమశిక్షణ, విద్యా విషయాలపై వివరాలు ఇచ్చారు. విద్యార్థులు క్రమపద్ధతిగా కళాశాలకు హాజరు కావడం, సబ్జెక్టులు సమయానికి పూర్తి చేయడం, అంకితభావంతో సామాజిక సంక్షేమానికి పాటుపడే విధంగా విద్యను అభ్యసించడం అవసర మని స్పష్టంగా సూచించారు. ప్రిన్సిపల్ విద్యార్జనతోపాటు విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని, నైతిక విలువలను పాటిస్తూ, అసాంఘిక కార్యకలాపాల నుండి దూరంగా ఉండి కళాశాల పేరు మరియు తల్లిదండ్రుల ఆకాంక్షలను నిలబెట్టాలనని సూచించారు.భోజనానంతరం, విద్యార్థినీ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అదరగొట్టారు. అలాగే ఈ కార్యక్రమంలో ఫైనల్ ఇయర్ విద్యార్థుల ఫేర్వెల్ కూడా నిర్వహించబడింది. ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు, కళా శాల వదిలి బయలుదేరే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యులు: తెలుగు శాఖ అధ్యక్షులు: డాక్టర్ చాట్ల కిషోర్ ఇంగ్లీష్ శాఖ అధ్యక్షులు: పాల్ బాబు, వాసుదేవరావు రసాయన శాస్త్ర విభాగాధ్యక్షులు: ఎం.ఎం.వి.వై. స్వామి వాణిజ్య శాస్త్ర విభాగాధ్యక్షులు: డాక్టర్ కొండ్రు రమేష్ బాబు భౌతిక శాస్త్ర శాఖ అధ్యక్షులు: డాక్టర్ పులి రజనీకాంత్ ఇంకా కిషోర్ బాబు, అప్పా రెడ్డి, మధుసూదన్ రావు క్రమవద్ధంగా సాగిన ఈ కార్యక్ర మం, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలతో ముగిసింది.

