మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం (ICDS)లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గానికి చెందిన పలువురు మినీ అంగన్వాడీ కార్యకర్తలు మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా అప్గ్రేడ్ అయ్యారు.ఈ సందర్భంగా సోమవారం నాడు నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో అప్గ్రేడ్ ఉత్తర్వులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలు, శాఖ అధికారులతో కలిసి కార్యకర్తలకు అందజేశారు.ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, అంగన్వాడీ కార్యకర్తలు మహిళా, శిశు సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. గ్రామీణ స్థాయిలో తల్లి–శిశు ఆరోగ్యం, పోషణ, విద్యా అవగాహన పెంపొందించడంలో వారి సేవలు అమూల్య మైనవని ప్రశంసించారు.అంగన్వాడీ కార్యకర్తల సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం చేపడుతున్న ఈ అప్గ్రేడ్ ప్రక్రియ అభినందనీయమని పేర్కొన్న ఆమె, కూటమి ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారం, వారి సంక్షేమానికి ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.

నందిగామలో మినీ అంగన్వాడీ కార్యకర్తలకు మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ ఉత్తర్వుల ప్రదానం