Sunday, 7 December 2025
  • Home  
  • ధాన్యం తడవకుండా చూడాలని ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్ ఛార్జ్ లను ఆదేశించిన : జిల్లా కలెక్టర్
- తెలంగాణ

ధాన్యం తడవకుండా చూడాలని ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్ ఛార్జ్ లను ఆదేశించిన : జిల్లా కలెక్టర్

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) వర్షానికి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్ ఛార్జ్ లను ఆదేశించారు. గురువారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తో కలిసి, నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలం చిరుమర్తి గ్రామం లో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మోందా తుఫాను కారణంగా గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఐకెపి కేంద్రంలోని ధాన్యం తడిసి రంగు మారిపోగా, ధాన్యం కొనుగోలు విషయంలో చిరుమర్తి కొనుగోలు కేంద్రానికి అనుసంధానం చేసిన రైస్ మిల్లుతో సమన్వయం చేసుకొని, ధాన్యం దించుకునేలా చూడాలని డిఆర్డిఓ శేఖర్ రెడ్డికి సూచించారు. ఎక్కువ రోజులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉండవద్దని వర్షాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉంచాలని చెప్పారు. అయితే ఈ కేంద్రంలో కేవలం నలుగురు రైతులకు చెందిన ధాన్యం మాత్రమే వర్షానికి తడిసిపోయి రంగు మారిపోయినట్లు డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు వివరించారు.

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
వర్షానికి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్ ఛార్జ్ లను ఆదేశించారు. గురువారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తో కలిసి, నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలం చిరుమర్తి గ్రామం లో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మోందా తుఫాను కారణంగా గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఐకెపి కేంద్రంలోని ధాన్యం తడిసి రంగు మారిపోగా, ధాన్యం కొనుగోలు విషయంలో చిరుమర్తి కొనుగోలు కేంద్రానికి అనుసంధానం చేసిన రైస్ మిల్లుతో సమన్వయం చేసుకొని, ధాన్యం దించుకునేలా చూడాలని డిఆర్డిఓ శేఖర్ రెడ్డికి సూచించారు. ఎక్కువ రోజులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉండవద్దని వర్షాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉంచాలని చెప్పారు. అయితే ఈ కేంద్రంలో కేవలం నలుగురు రైతులకు చెందిన
ధాన్యం మాత్రమే వర్షానికి తడిసిపోయి రంగు మారిపోయినట్లు డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.