సీనియర్ జర్నలిస్ట్ రమణ, నవంబర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం, అయినవిల్లి గ్రామంలో భక్తి పరవశంగా, వైభవంగా నిర్వహించిన ద్వాదశ జ్యోతిర్లింగముల దివ్య దర్శనం కార్యక్రమం విశేషంగా జరిగింది. గ్రామంలోని ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ ఆధ్యాత్మిక సమాగమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జ్యోతిర్లింగాల దర్శనం పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు
ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, నైతికత, సానుకూలత పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. “భగవంతుని సన్నిధిలో జరిగే ఈ దివ్య దర్శనం మనసుకు శాంతినివ్వడమే కాక, జీవన విధానంలో జ్ఞానాన్ని పెంపొందించే ఆధ్యాత్మిక పరిపూర్ణతను ఇస్తుంది” అని అన్నారు. ప్రజలు ఆధ్యాత్మికతను జీవితంలో భాగంగా చేసుకుంటే సమాజం మరింత సుస్థిరంగా ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తుల నడుమ శివభక్తి నినాదాలు మార్మోగగా, జరిగిన వేడుకలు ప్రాంతమంతా ఉత్సాహాన్ని నింపాయి.


