కాకినాడ జిల్లా జగ్గంపేట సెప్టెంబర్ 22 పున్నమి ప్రతినిధి:
కాకినాడ జిల్లా జగ్గంపేటలో దేవీ నవరాత్రుల ప్రారంభం సందర్భంగా టిడిపి జిల్లా అధ్యక్షుడు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ పలు దేవీ మండపాలను దర్శించారు. శెట్టిబలిజి కాలనీలో బి. సూరిబాబు, ఎలుగుబంటి సూరిబాబు సమకూర్చిన విగ్రహాల వద్ద ఏర్పాటు చేసిన మండపంలో ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం పద్మనాభనగర్ చెరువు గట్టుపై వెలసిన కనకదుర్గ అమ్మవారి మండపాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రులు శక్తి స్వరూపిణి అమ్మవారి ఆశీస్సులు పొందే పర్వదినాలని, ప్రజలందరికీ అమ్మవారి కటాక్షం ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, పాండ్రంగి రాంబాబు, బుర్రి సత్తిబాబు, దేవరపల్లి మూర్తి, నీలం శ్రీను, వెలిశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు.


