దూదేకుల సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తా
-దూదేకుల సంఘం రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు
సిద్ధవటం సెప్టెంబర్ 11 ( పున్నమి ప్రతినిధి)
ఏపీ రాష్ట్ర నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు అన్నారు.రాష్ట్ర నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ డైరెక్టరుగా నియమితులైన వీరభద్రుడు మండలంలోని మాధవరం-1 లోని తన నివాసంలో గురువారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేత్రుత్వంలో దూదేకుల సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.సిద్ధవటంలోని ప్రధాన రహదారి రోడ్డు విస్తరణ పనులు, సిద్ధవటంలోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ తొలగింపు,మాచుపల్లి పెన్నా నదిలో వంతెన నిర్మాణ పనులు కడపాయపల్లె గ్రామంలో పెన్నా నది తీర ప్రాంతంలోని రైతుల భూములు కోతకు గురైన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు నేతృత్వంలో సమస్య పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కూటమి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగే విధంగా పార్టీ అన్ని విధాలుగా కృషి చేస్తుందని ఆయన చెప్పారు.


