నల్లబెల్లి
నల్లబెల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో చికెన్ సెంటర్ నిర్వాహకుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న చికెన్ సెంటర్ల యజమానుల పోకడలు మితి మీరి పోతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ కోల్లను మూడురోజులకు ఒకసారి దిగుమతులు చేసుకోకుండా దుకాణంలొనే కోళ్లను పెంచడం విడ్డురంగా మారింది. కోళ్లు విడుదల చేసే వ్యర్థాల వలన దుకాణం ముందు నుండి వచ్చే పోయే వాళ్ళకి, పక్కన దుకాణ దారులకు ముక్కు పుటలు అదిరేలా దుర్వాసన వెదజల్లుతుందని చెబుతున్నారు
కోళ్ల వ్యర్థాలను ప్రభుత్వ కార్యాలయం ముందు పారబోస్తున్న వ్యాపారులు..
గత కొన్ని రోజులుగా కోళ్ల వ్యర్ధాలను గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళల్లో చికెన్ సెంటర్ల నిర్వాహకులు మండల ప్రజా పరిషత్ కార్యాలయం మరియు ఎస్సారెస్పీ కాలువలో పారబోస్తున్నారు. కార్యాలయానికి వచ్చే వ్యక్తులకు ఆ వ్యర్ధాలు భరించలేని దుర్వాసన వస్తుండడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం..
ఎస్సారెస్పీ నీటిలో కోళ్ల వ్యర్థాలను పారబోస్తూ ఉండడంతో భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు రైతులు అంటున్నారు.
అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదు : వైనాల మధు.. కామన్ మ్యాన్
కోళ్ల వ్యర్ధాలను చికెన్ సెంటర్ల వ్యాపారస్తులు మండల పరిషత్ కార్యాలయం వద్ద వేస్తున్నారని అధికారులకు తెలిపిన పట్టించుకోలేదని అన్నారు. అలాగే బస్టాండ్ దారుణంలో దుర్వాసనతో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. చికెన్ సెంటర్ల వద్ద నుండి వచ్చే దుర్వాసనతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని. అలాగే తక్షణమే చికెన్ సెంటర్ లను బస్టాండ్ ఆవరణము నుండి తీసివేసి ఇప్పటికైనా కోళ్ల వ్యర్ధాలు ఎస్సారెస్పీ కాలువలో మరియు మండల ప్రజా పరిషత్ ఆవరణంలో వెయ్యకుండా కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు


