దుర్గమ్మ దర్శనానికి తరలి వెళ్లిన భవానీలు
ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి (అక్టోబర్ 3)
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి శుక్రవారం భవానిలు దీక్ష విరమణ కోసం తరలి వెళ్లారు. ఆగిరిపల్లి రుద్రభూమి వద్ద వేంచేసియున్న కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో ఆలయ అర్చకులు శ్రీనివాసమూర్తి దుర్గమ్మకు పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు భవాని నక్కనబోయిన శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో 30 మంది భవానీ దీక్షాదారులకు ఇరుముడి కట్టారు. అనంతరం అమ్మవారి ఇరుముడి సమర్పణకు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయానికి తరలి వెళ్లారు.

దుర్గమ్మ దర్శనానికి తరలి వెళ్లిన భవానీలు
దుర్గమ్మ దర్శనానికి తరలి వెళ్లిన భవానీలు ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి (అక్టోబర్ 3) విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి శుక్రవారం భవానిలు దీక్ష విరమణ కోసం తరలి వెళ్లారు. ఆగిరిపల్లి రుద్రభూమి వద్ద వేంచేసియున్న కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో ఆలయ అర్చకులు శ్రీనివాసమూర్తి దుర్గమ్మకు పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు భవాని నక్కనబోయిన శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో 30 మంది భవానీ దీక్షాదారులకు ఇరుముడి కట్టారు. అనంతరం అమ్మవారి ఇరుముడి సమర్పణకు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయానికి తరలి వెళ్లారు.

