Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

దారి దోపిడీ కేసులో ఏడుగురు నిందితుల అరెస్టు

Punnami Newsroom Published:
దారి దోపిడీ కేసులో ఏడుగురు నిందితుల అరెస్టు

Story highlights

  • నెల్లూరు: రాళ్లతో దాడి చేసి నగదు, సెల్‌ఫోన్ అపహరించిన దోపిడీ కేసులో ఏడుగురు నిందితులను చిన్నబజారు పోలీసులు అరెస్టు చేశారు.
  • ఈ కేసు వివరాలను నగర ఏఎస్పీ దీక్ష ఆదివారం వెల్లడించారు.నెల్లూరులోని జెండావీధికి చెందిన సయ్యద్ సమీవుల్లా ఈ నెల 10వ తేదీ రాత్రి ఎస్2 థియేటర్ సమీపంలోని రైల్వే ట్రాక్ గోడ వద్దకు వెళ్లారు.
  • ఈ సమయంలో అక్కడికి చేరుకున్న ఏడుగురు వ్యక్తులు ఆయనపై రాళ్లతో దాడి చేసి, రూ.5 వేల నగదు, సెల్‌ఫోన్‌ను తీసుకుని పరారయ్యారు.బాధితుడి ఫిర్యాదు మేరకు చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నెల్లూరు: రాళ్లతో దాడి చేసి నగదు, సెల్‌ఫోన్ అపహరించిన దోపిడీ కేసులో ఏడుగురు నిందితులను చిన్నబజారు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను నగర ఏఎస్పీ దీక్ష ఆదివారం వెల్లడించారు.నెల్లూరులోని జెండావీధికి చెందిన సయ్యద్ సమీవుల్లా ఈ నెల 10వ తేదీ రాత్రి ఎస్2 థియేటర్ సమీపంలోని రైల్వే ట్రాక్ గోడ వద్దకు వెళ్లారు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న ఏడుగురు వ్యక్తులు ఆయనపై రాళ్లతో దాడి చేసి, రూ.5 వేల నగదు, సెల్‌ఫోన్‌ను తీసుకుని పరారయ్యారు.బాధితుడి ఫిర్యాదు మేరకు చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇన్‌స్పెక్టర్ సీహెచ్ సీతారామయ్య పర్యవేక్షణలో పోలీసులు ఆదివారం సీఏఎం స్కూల్ సమీపంలో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దోపిడీకి సంబంధించిన సొత్తుతో పాటు, నేరానికి ఉపయోగించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.నిందితులను పట్టుకోవడంలో చొరవ చూపిన ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐ, పోలీసు సిబ్బందిని ఏఎస్పీ దీక్ష అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *