గాజువాక, సెప్టెంబర్ , (పున్నమి ప్రతినిధి):
మహా విశాఖ నగర పాలక సంస్థ 87వ వార్డు పరిధిలో కణితి కాలనీల దసరా ఉత్సవాల సందర్భంగా శ్రీ రథాలమ్మ రజక సేవా సంఘం, రదాలమ్మ శెట్టి బలిజి సేవా సంఘం, కాకి మధు ఆధ్వర్యంలో దుర్గాదేవి విగ్రహాలను ప్రతిష్టించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు, బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనం అందింది. వేద పండితులచే వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బొడ్డ గోవిందా, ఎన్నేటి రమణ, చిత్రాడ రమణ, ముద్దపు దామోదర్, దుగ్గపు దానప్పలు, మడక నర్సింగరావు, ఇతర వార్డు నాయకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దేవి దర్శనాన్ని ఆస్వాదించారు.


