విశాఖ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
“వెలమ సంక్షేమ సంఘం” తిరుపతి.వారు ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేసి,సత్కరించడం అయినది. ఈ కార్యక్రమం నకు తిరుపతి వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రంగినేని గోపాల్ నాయుడు . అధ్యక్షతన, రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షులు, రొంగల గోపి శ్రీనివాస్.,శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు డైరెక్టర్ ,శ్రీ.మొక్కపాటి రమణయ్య నాయుడు గారు , చిత్తూరు జిల్లా బిజెపి కార్యదర్శి, .రమణ బాబు ., వెలమ ఫౌండేషన్ చైర్మన్, ఎం.వి.ఆర్. మూర్తి , మరియు వెలమ సంక్షేమ సంఘం తిరుపతి కార్యదర్శి . కె నాగేశ్వరయ్య గారు, కోశాధికారి .వి మురళి , వేదిక నలంకరించి పలు విషయాలపై వక్తలు వారి యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ, సందేశాలను వినిపిస్తూ, ముఖ్యంగా తిరుపతిలో “వెలమ సంక్షేమ ఉచిత యాత్రి నివాస్ భవనం” ఆవశ్యకతను వివరించి, ముఖ్య అతిథి పి.వి.ఎన్. మాధవ్ . దృష్టికి తీసుకురావడం జరిగినది. అందులకు
పివిఎన్ మాధవ్ . సానుకూలంగా స్పందించి, భవనమునకు అవసరమైన స్థలాన్ని, ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసి, భవన నిర్మాణానికి కూటమి పెద్దలు మరియు వెలమ ముఖ్య నాయకులు అందరితో చర్చించి, భవన నిర్మాణానికి కృషి చేస్తానని, చెప్పడమైనది. ఈ సమావేశం ద్వారా తిరుపతిలో వెలమ భవనం నిర్మాణం కొరకు నిర్ణయం తీసుకోవడం అయినది . ⭐త్వరలో పార్టీలకు,ప్రాంతాలకు, వర్గాలకు,అతీతంగా సమావేశం ఏర్పాటు చేసి, భవన నిర్మాణం కొరకు కమిటీ మరియు రాష్ట్ర సంఘం ఏర్పాటు చేయడానికి, ఏకగ్రీవంగా ఆమోదించడమైనది. ఈ సమావేశంలో అందరూ వెలమ సంక్షేమ ,అభివృద్ధి, ఐక్యత కోసం కృషి చేస్తామని, ఏకగ్రీవంగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, ముఖ్య అతిథి ,.పి.వి.ఎన్. మాధవ్ ని అభినందిస్తూ, సత్కరించడం అయినది.
జై వెలమ! జై జై వెలమ.
వెలమ ఐక్యత వర్ధిల్లాలి.


