Tuesday, 9 December 2025
  • Home  
  • తెలుగు రాష్ట్రాల నుంచే 35 వేల మంది స్టూడెంట్‌ వీసాదారులపైనా తీవ్ర ప్రభావం
- జాతీయ అంతర్జాతీయ

తెలుగు రాష్ట్రాల నుంచే 35 వేల మంది స్టూడెంట్‌ వీసాదారులపైనా తీవ్ర ప్రభావం

సెప్టెంబర్ 21పున్నమి ప్రతినిధి @ హెచ్‌1-బీ వీసాల ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంతో భారతీయుల డాలర్‌ డ్రీమ్స్‌ చెదిరిపోనున్నాయి. తెలుగు రాష్ట్రాల యువతపైనే అధిక ప్రభావం ఉండనుంది. అగ్రరాజ్యం ఏటా మొత్తం 85 వేల హెచ్‌1-బీ వీసాలు జారీ చేస్తుండగా.. ఇందులో దాదాపు 73శాతం(62 వేలు) భారతీయులే దక్కించుకుంటున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారి సంఖ్య దాదాపు 35వేలు. మిగతా 27 శాతంలో 12 శాతం చైనా, ఇతర దేశాల పౌరులు ఉంటున్నారు. ట్రంప్‌ నిర్ణయంతో ఈ వీసాలపై అమెరికాకు వెళ్లే ఆశలు వదులుకోవాల్సిందేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు అమెరికాలోని కంపెనీలు విదేశీ నిపుణులకు హెచ్‌1-బీ వీసాలతో కొలువులు ఇస్తున్నాయి. ముందుగా మూడేళ్ల కాలానికి జారీ చేసి.. ఆ తర్వాత కొనసాగిస్తున్నాయి. స్థానికులతో పోలిస్తే తక్కువ జీతాలే వస్తున్నా.. కొలువుల కోసం విదేశీయులు భారీగా వెళ్లేవారు. అమెరికాలోని ఐటీ, వైద్య రంగాల్లో విదేశీ నిపుణుల్లో 73 శాతం భారతీయులే. గత ఐదేళ్లలో దాదాపు 4 లక్షల మంది భారతీయులు హెచ్‌1-బీపై అమెరికాలో ఉద్యోగాలు పొందారు. ఇప్పటివరకు కొత్తగా వచ్చిన హెచ్‌1-బీ వీసాదారులకు అమెరికాలోని కంపెనీలు ఏడాదికి సరాసరి లక్ష డాలర్ల జీతం ఇస్తున్నాయి. తాజా నిబంధనలతో ఏడాదికి కనీసం 1.50 లక్షల డాలర్ల వేతనం చెల్లించాలని ట్రంప్‌ ఆదేశాలిచ్చారు. లక్ష డాలర్లు వీసా ఫీజు పోతే, మిగతా 50వేల డాలర్ల కోసం వెళ్లేందుకు విదేశీ నిపుణులు ఆసక్తి చూపించరు. దీంతో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పేర్కొంటున్నారు. సుంకాలపై భారత్‌-అమెరికా మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో భారతీయ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకునే ట్రంప్‌ పొమ్మనలేక పొగబెట్టారని అక్కడి తెలుగు సంఘాలు పేర్కొంటున్నాయి. ఉన్నత చదువులపైనా ప్రభావం ట్రంప్‌ తాజా నిర్ణయంతో హెచ్‌1-బీ వీసాదారులపైనే కాదు.. ఉన్నత విద్య కోసం వెళ్లే వారిపైనా తీవ్ర ప్రభావం పడనుంది. ప్రతి ఏటా దాదాపు లక్ష మంది విద్యార్థులు ఎంఎస్‌, ఎంబీఏ, మెడిసిన్‌ కోసం స్టూడెంట్‌ వీసా (ఎఫ్‌-1)పై అమెరికా వెళుతున్నారు. గతంలో చదువుతూ ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉండగా.. ట్రంప్‌ సర్కారు ఇప్పటికే అలా ఉద్యోగం చేయడంపై నిషేధం విధించింది. దీంతో ఎలాగోలా వెళ్తే చాలు.. ఏదో ఒక పనిచేసుకుంటూ చదువుకోవచ్చన్న మధ్యతరగతి విద్యార్థుల ధీమా ఇప్పటికే సడలిపోయింది. తాజా ఆదేశాలతో స్టూడెంట్‌ వీసాపై వెళ్లే వారికి అక్కడ భవిష్యత్తు ఉంటుందన్న ఆశ లేకుండా పోయిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎఫ్‌-1 వీసా తర్వాత కోర్సులను బట్టి విద్యార్థులకు 12-36 నెలల వరకు ఓపీటీ (ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌) గడువు ఉంటుంది. అప్పటిలోగా హెచ్‌1-బీ వీసా సాధిస్తే అక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు. తాజా నిబంధనలతో ఓపీటీ గడువులో ఉన్నవారు పూర్తయిన వెంటనే స్వదేశానికి రావాల్సిందే. హెచ్‌1-బీ వీసా లక్ష్యంతోనే అనేక మంది ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లేవారు. ఇప్పుడా ఆశలు ఆవిరయ్యాయని అమెరికా తెలుగు అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు భువనేష్‌ ‘ఆంధ్రజ్యోతి’తో పేర్కొన్నారు. ట్రంప్‌ ఆదేశాలపై స్థానికంగా యువతలో హర్షం వ్యక్తమవుతోందని, హెచ్‌1-బీ లక్ష్యంగా పెట్టుకున్న భారతీయులు ఇక అమెరికా వచ్చే అవకాశాలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు.

సెప్టెంబర్ 21పున్నమి ప్రతినిధి @
హెచ్‌1-బీ వీసాల ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంతో భారతీయుల డాలర్‌ డ్రీమ్స్‌ చెదిరిపోనున్నాయి. తెలుగు రాష్ట్రాల యువతపైనే అధిక ప్రభావం ఉండనుంది. అగ్రరాజ్యం ఏటా మొత్తం 85 వేల హెచ్‌1-బీ వీసాలు జారీ చేస్తుండగా.. ఇందులో దాదాపు 73శాతం(62 వేలు) భారతీయులే దక్కించుకుంటున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారి సంఖ్య దాదాపు 35వేలు. మిగతా 27 శాతంలో 12 శాతం చైనా, ఇతర దేశాల పౌరులు ఉంటున్నారు. ట్రంప్‌ నిర్ణయంతో ఈ వీసాలపై అమెరికాకు వెళ్లే ఆశలు వదులుకోవాల్సిందేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు అమెరికాలోని కంపెనీలు విదేశీ నిపుణులకు హెచ్‌1-బీ వీసాలతో కొలువులు ఇస్తున్నాయి. ముందుగా మూడేళ్ల కాలానికి జారీ చేసి.. ఆ తర్వాత కొనసాగిస్తున్నాయి. స్థానికులతో పోలిస్తే తక్కువ జీతాలే వస్తున్నా.. కొలువుల కోసం విదేశీయులు భారీగా వెళ్లేవారు. అమెరికాలోని ఐటీ, వైద్య రంగాల్లో విదేశీ నిపుణుల్లో 73 శాతం భారతీయులే. గత ఐదేళ్లలో దాదాపు 4 లక్షల మంది భారతీయులు హెచ్‌1-బీపై అమెరికాలో ఉద్యోగాలు పొందారు. ఇప్పటివరకు కొత్తగా వచ్చిన హెచ్‌1-బీ వీసాదారులకు అమెరికాలోని కంపెనీలు ఏడాదికి సరాసరి లక్ష డాలర్ల జీతం ఇస్తున్నాయి. తాజా నిబంధనలతో ఏడాదికి కనీసం 1.50 లక్షల డాలర్ల వేతనం చెల్లించాలని ట్రంప్‌ ఆదేశాలిచ్చారు. లక్ష డాలర్లు వీసా ఫీజు పోతే, మిగతా 50వేల డాలర్ల కోసం వెళ్లేందుకు విదేశీ నిపుణులు ఆసక్తి చూపించరు. దీంతో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పేర్కొంటున్నారు. సుంకాలపై భారత్‌-అమెరికా మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో భారతీయ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకునే ట్రంప్‌ పొమ్మనలేక పొగబెట్టారని అక్కడి తెలుగు సంఘాలు పేర్కొంటున్నాయి.

ఉన్నత చదువులపైనా ప్రభావం

ట్రంప్‌ తాజా నిర్ణయంతో హెచ్‌1-బీ వీసాదారులపైనే కాదు.. ఉన్నత విద్య కోసం వెళ్లే వారిపైనా తీవ్ర ప్రభావం పడనుంది. ప్రతి ఏటా దాదాపు లక్ష మంది విద్యార్థులు ఎంఎస్‌, ఎంబీఏ, మెడిసిన్‌ కోసం స్టూడెంట్‌ వీసా (ఎఫ్‌-1)పై అమెరికా వెళుతున్నారు. గతంలో చదువుతూ ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉండగా.. ట్రంప్‌ సర్కారు ఇప్పటికే అలా ఉద్యోగం చేయడంపై నిషేధం విధించింది. దీంతో ఎలాగోలా వెళ్తే చాలు.. ఏదో ఒక పనిచేసుకుంటూ చదువుకోవచ్చన్న మధ్యతరగతి విద్యార్థుల ధీమా ఇప్పటికే సడలిపోయింది. తాజా ఆదేశాలతో స్టూడెంట్‌ వీసాపై వెళ్లే వారికి అక్కడ భవిష్యత్తు ఉంటుందన్న ఆశ లేకుండా పోయిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎఫ్‌-1 వీసా తర్వాత కోర్సులను బట్టి విద్యార్థులకు 12-36 నెలల వరకు ఓపీటీ (ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌) గడువు ఉంటుంది. అప్పటిలోగా హెచ్‌1-బీ వీసా సాధిస్తే అక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు. తాజా నిబంధనలతో ఓపీటీ గడువులో ఉన్నవారు పూర్తయిన వెంటనే స్వదేశానికి రావాల్సిందే. హెచ్‌1-బీ వీసా లక్ష్యంతోనే అనేక మంది ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లేవారు. ఇప్పుడా ఆశలు ఆవిరయ్యాయని అమెరికా తెలుగు అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు భువనేష్‌ ‘ఆంధ్రజ్యోతి’తో పేర్కొన్నారు. ట్రంప్‌ ఆదేశాలపై స్థానికంగా యువతలో హర్షం వ్యక్తమవుతోందని, హెచ్‌1-బీ లక్ష్యంగా పెట్టుకున్న భారతీయులు ఇక అమెరికా వచ్చే అవకాశాలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.