*తెలకపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్*
పున్నమి: అక్టోబర్ 17 ప్రతినిధి తెలంగాణ:
* విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల సమయపాలన, బోధనా ప్రమాణాలను పరిశీలించిన కలెక్టర్
* పాఠశాలలో మొత్తం 126 మంది విద్యార్థుల్లో 91 మంది మాత్రమే హాజరని గుర్తించి అసంతృప్తి వ్యక్తం
* విద్యార్థుల హాజరు శాతం పెంచే బాధ్యత ప్రధానోపాధ్యాయులదేనని కలెక్టర్ స్పష్టం
* తల్లిదండ్రులతో సమన్వయం చేసుకొని 100% హాజరు సాధించాలంటూ ఉపాధ్యాయులకు ఆదేశాలు
* ఫేషియల్ అటెండెన్స్ విధానం సక్రమంగా అమలు అవుతుందో లేదో వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్
* విద్యార్థుల కోసం మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలంటూ వంట ఏజెన్సీ నిర్వాహకులకు సూచనలు
* పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచన
* ప్రతి విద్యార్థి లక్ష్యం పెట్టుకుని దాని సాధనకు కృషి చేయాలని కలెక్టర్ పిలుపు
* గణితంలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతిరోజు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచన
* ప్రతి వారం పరీక్షలు నిర్వహించి విద్యార్థుల పురోగతిని అంచనా వేయాలంటూ సూచించిన కలెక్టర్
* బోధనను మరింత ప్రాక్టికల్‌గా, ఆసక్తికరంగా మార్చాలని ఉపాధ్యాయులకు సూచన
* దీర్ఘకాలంగా గైర్హాజరయ్యే విద్యార్థులను గుర్తించి తల్లిదండ్రులతో సమీక్షలు నిర్వహించాలని ఆదేశం
* పాఠశాల పరిసరాలను పరిశీలించి శుభ్రత, క్రమశిక్షణ, నిర్వహణపై సూచనలు ఇచ్చిన కలెక్టర్
* కలెక్టర్ వెంట మండల తహసిల్దార్ జాకిర్ ఆలీ, ప్రధానోపాధ్యాయుడు శోభన్ బాబు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

