యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాలయాపనతో ప్రజాపాలన ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఎస్ఎఫ్ఐ భువనగిరి పట్టణ కార్యదర్శి ఈర్ల రాహుల్ అన్నారు.
సోమవారం పట్టణ కేంద్రంలోని సుందరయ్య భవన్లో పట్టణ సహాయ కార్యదర్శి కరెట్లపల్లి భవాని శంకర్ అధ్యక్షతన భువనగిరి పట్టణ కమిటీ సమావేశం నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వం స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఎలా కాలయాపన చేసిందో ఈ ప్రజా పాలన ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరిస్తుందనిన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఎనిమిది వేల కోట్ల 3 వందల స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ప్రతిపక్షంలో ఉండి అనేక వాగ్దానాలు చేసే అధికారంలోకి వచ్చినంక విద్యారంగ సమస్యలను పరిష్కరించకుండా కేవలం మాటలకు పరిమితం అవుతూ ముందుకెళుతుందని అన్నారు. తెలంగాణలో విద్యార్థులు స్కాలర్షిప్లు రాక తీవ్ర ఇక్కట్లు గురి అవుతూ చదువుకు పేద విద్యార్థులు దూరమవుతున్నారని అన్నారు. నెలలో అనేకసార్లు క్యాబినెట్ మీటింగ్లు పెట్టి విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోవడం అంటే దేనికి సంకేతం అని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణలో విద్యారంగం అనేక సమస్యలతో ఉన్నదని పరిష్కరించే నాధుడే లేరని తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వం అంటే కేవలం మాటలు చెప్పే ప్రభుత్వం లాగానే మిగిలిపోయిందని వారు అన్నారు. పేద విద్యార్థుల బాధలను పట్టించుకోని తక్షణమే స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులందరినీ సమీకరించి పోరాటాలను ఉదృతం చేస్తామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పట్టణ ఉపాధ్యక్షులు ఏడుమేకల మహేష్, సుష్మ, దీప్తి పట్టణ నాయకులు వెన్నెల,ప్రేమజ, మౌనిక, పాల్గొన్నారు…


