Wednesday, 25 March 2026
  • Home  
  • *తెలంగాణలో పోలీసు తనిఖీలు షురూ!*
- తెలంగాణ

*తెలంగాణలో పోలీసు తనిఖీలు షురూ!*

*50 వేల రూపాయల వరకే అనుమతి!* పున్నమి ప్రతినిధి, హైదరాబాద్:సెప్టెంబర్ 30 తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఈ రోజు నుంచి బస్సులోను పోలీసులు తనిఖీలు చేపట్టనున్నారు.నిన్నటి నుంచే పోలీసు అధికారులు జాతీయ రాష్ట్ర జిల్లా రహ దారులపై వాహనాలను సోదాలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి రూ.50,000 నగదు మాత్రమే తీసుకువెళ్ళేందుకు అనుమతి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉండాలంటే సరైన పత్రాలు లేకపోతే దానిని పోలీసులు సీజ్ చేస్తారు.తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు.అదే ఎక్కువగా ఉంటే ఎన్నికల అధికారులు ఆదాయ పన్ను జీఎస్టి అధికారులకు సమాచారం అందించి ఆ డబ్బును కోర్టులో జమ చేస్తారు..అత్యవసరమైన వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు వంటి ముఖ్యమైన అవసరాలకు పెద్ద మొత్తల్లో నగదు తీసుకువెళ్ళేవారు సరైన ఆధారాలు దగ్గరుంచుకొని అధికారులకు చూపాలి. తనిఖీల సమయంలో చూపలేకపోయినా తర్వాత ఈ పత్రాలను సమర్పిస్తే జప్తు చేసిన డబ్బును తిరిగిస్తారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున నగదు రవాణపై నిబంధనలు పాటించాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.

*50 వేల రూపాయల వరకే అనుమతి!*

పున్నమి ప్రతినిధి,

హైదరాబాద్:సెప్టెంబర్ 30

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఈ రోజు నుంచి బస్సులోను పోలీసులు తనిఖీలు చేపట్టనున్నారు.నిన్నటి నుంచే పోలీసు అధికారులు జాతీయ రాష్ట్ర జిల్లా రహ దారులపై వాహనాలను సోదాలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి రూ.50,000 నగదు మాత్రమే తీసుకువెళ్ళేందుకు అనుమతి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉండాలంటే సరైన పత్రాలు లేకపోతే దానిని పోలీసులు సీజ్ చేస్తారు.తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు.అదే ఎక్కువగా ఉంటే ఎన్నికల అధికారులు ఆదాయ పన్ను జీఎస్టి అధికారులకు సమాచారం అందించి ఆ డబ్బును కోర్టులో జమ చేస్తారు..అత్యవసరమైన వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు వంటి ముఖ్యమైన అవసరాలకు పెద్ద మొత్తల్లో నగదు తీసుకువెళ్ళేవారు సరైన ఆధారాలు దగ్గరుంచుకొని అధికారులకు చూపాలి. తనిఖీల సమయంలో చూపలేకపోయినా తర్వాత ఈ పత్రాలను సమర్పిస్తే జప్తు చేసిన డబ్బును తిరిగిస్తారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున నగదు రవాణపై నిబంధనలు పాటించాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.