మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి బాధితుడికి రూ.1000 చొప్పున అందజేయాలని నిర్ణయించింది. ఒక కుటుంబంలో ముగ్గురికంటే ఎక్కువ మంది ఉంటే గరిష్టంగా రూ.3000 వరకు ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నగదు సాయం పునరావాస కేంద్రాల నుంచి తమ ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో అందజేయబడుతుంది. తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు ప్రభుత్వం తక్షణ సహాయాన్ని అందిస్తూ చర్యలు వేగవంతం చేసింది.

తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం – ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున ప్రభుత్వం ప్రకటించింది