మొంత తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సహాయం తుఫాన్ ప్రభావిత గ్రామాలు, రిలీఫ్ క్యాంపులు మరియు జీవనోపాధి దెబ్బతిన్న మత్స్యకార కుటుంబాలకు అందించబడుతుంది.
పంపిణీ జాబితా:
1️⃣ బియ్యం – 25 కిలోలు (మత్స్యకారులకు 50 కిలోలు)
2️⃣ రెడ్‌గ్రామ్ దాల్ – 1 కిలో
3️⃣ పిండి నూనె – 1 లీటర్
4️⃣ ఉల్లిపాయలు – 1 కిలో
5️⃣ బంగాళదుంపలు – 1 కిలో
6️⃣ చక్కెర – 1 కిలో
సివిల్ సప్లైస్ కమిషనర్ విజయవాడ నుండి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. అవసరమైన వివరాలు సేకరించి వెంటనే రైస్, దాల్, ఆయిల్, షుగర్ పంపిణీ ప్రారంభించాలని సూచించారు.


