*తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..*
*-జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల సూచన..*
తుఫాన్ కారణంగా జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని అధికారులతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల సూచించారు. పొదలకూరు మండలంలోని నావూరుపల్లి పెద్దవాగు పొంగి నాలుగు గ్రామాలకు రాకపోకలు స్తంభించడంతో వాగు ఉద్ధృతిని బుధవారం సాయంత్రం ఆమె పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వర్షాలు తగ్గుముఖం పట్టి కాలువలు, వాగుల్లో నీటి ప్రవాహం తగ్గేవరకు రైతులు, ప్రజలు సాహశించి వాటిని దాటే ప్రయత్నం చేయరాదన్నారు. పెన్నా నది పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి శ్రీనివాసులు, పొదలకూరు సిఐ ఏ శివరామకృష్ణారెడ్డి, ఎస్ఐ మహమ్మద్ హనీఫ్, పొదలకూరు పీఏసీఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు తదితరులు పాల్గొన్నారు.


