Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Visakhapatnam

తుఫాను బాధిత మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వ చేయూత… మంగ మారిపేటలో నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గంటా

Punnami Newsroom Published:
తుఫాను బాధిత మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వ చేయూత… మంగ మారిపేటలో నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గంటా

విశాఖపట్నం జిల్లా,భీమిలి, (పున్నమి ప్రతినిధి):

తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్న మత్స్యకార కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. సెప్టెంబర్ 22 నుంచి 25 వరకు తుఫాను ప్రభావానికి గురైన మంగమారిపేట నాలుగో వార్డులోని బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఉచిత నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. భీమిలి శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు స్వయంగా బాధిత కుటుంబాలకు సరుకులను అందజేశారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 కేజీల బియ్యంతో పాటు కందిపప్పు, వంటనూనె, పంచదార, బంగాళదుంపలు, ఉల్లిపాయలు తదితర నిత్యావసర సరుకులను అందించారు. తుఫాను కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న మత్స్యకార కుటుంబాలకు ఈ సహాయం కొంత ఊరటనిచ్చింది.

ప్రజలకు అండగా ప్రభుత్వం

విపత్కర పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించడం ద్వారా ప్రభుత్వం తమకు అండగా నిలిచిందని స్థానికులు పేర్కొన్నారు. బాధితులకు సహాయం అందించే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు చురుకుగా పాల్గొన్నారు.

పలువురు ప్రముఖుల హాజరు

ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జి చిక్కాల విజయబాబు, డి.ఏ.ఎన్. రాజు, గంటా నూకరాజు, చిన్నకుమారి, వార్డు అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జి పాసి నర్సింగ్‌రావు, విశాఖపట్నం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు మరియు శ్రీశ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం బోర్డు సభ్యులు గరికిన ఎల్లయ్య (కింగ్), మంగమారిపేట గ్రామ సొసైటీ అధ్యక్షులు గరికిన చిన్న ఎల్లయ్య, గ్రామ కుల పెద్ద వాసుపల్లి నర్సింగ్‌రావు, గ్రామ పెద్ద వాసుపల్లి నూకరాజు, వైస్ ప్రెసిడెంట్ వాసుపల్లి ఎల్లయ్య, అడ్వకేట్ సూరాడ నర్సింగరావు, పాసి త్రినాధ్ కుమార్, దూడ రమేష్, వాసుపల్లి మారాజు, దౌలపల్లి ఎల్లజీ, బడే రాము, వాసుపల్లి దాసు, మైలపల్లి దానయ్య, వాసుపల్లి రవి, గరికిన దిలీప్, చెవ్వకుల కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

అలాగే అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, మహిళలు, గ్రామ ప్రజలు హాజరై నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

తుఫాను కష్టకాలంలో బాధిత మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీతో ప్రభుత్వ సహాయక చర్యలు మంగమారిపేటలో కొనసాగాయి.

తుఫాను బాధిత మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వ చేయూత… మంగ మారిపేటలో నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గంటా

తుఫాను బాధిత మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వ చేయూత… మంగ మారిపేటలో నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గంటా

తుఫాను బాధిత మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వ చేయూత… మంగ మారిపేటలో నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గంటా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *