ప్రభుత్వ విప్ మరియు నందిగామ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య ఆదేశాల మేరకు, ఇటీవల తుఫాను ప్రభావంతో నందిగామ పట్టణం లోని పలు వార్డుల్లో అకాల వర్షాలు, వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సహాయ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, కూటమి నాయకులు మరియు పట్టణ అధికారులతో కలిసి బాబు జగజ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ నందు ఆశ్రయం పొందిన కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
మండవ కృష్ణకుమారి మాట్లాడు తూ, ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్కనే ఉంటుందని, విపత్తు సమయంలో ఎవరూ ఇబ్బంది పడకుండా ప్రతి కుటుంబానికి అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో శుభ్రతా కార్యక్రమాలు, మురుగు నీరు తొలగింపు పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక నేతలు, అధికారులు మరియు స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతి నిధులు పాల్గొన్నారు.

తుఫాను ప్రభావిత కుటుంబా లకు నిత్యావసర సరుకుల పంపిణీ – నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి
ప్రభుత్వ విప్ మరియు నందిగామ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య ఆదేశాల మేరకు, ఇటీవల తుఫాను ప్రభావంతో నందిగామ పట్టణం లోని పలు వార్డుల్లో అకాల వర్షాలు, వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సహాయ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, కూటమి నాయకులు మరియు పట్టణ అధికారులతో కలిసి బాబు జగజ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ నందు ఆశ్రయం పొందిన కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మండవ కృష్ణకుమారి మాట్లాడు తూ, ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్కనే ఉంటుందని, విపత్తు సమయంలో ఎవరూ ఇబ్బంది పడకుండా ప్రతి కుటుంబానికి అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో శుభ్రతా కార్యక్రమాలు, మురుగు నీరు తొలగింపు పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక నేతలు, అధికారులు మరియు స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతి నిధులు పాల్గొన్నారు.

