Sunday, 7 December 2025
  • Home  
  • తుఫానులోను ఆగని మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) దాతృత్వం
- ఆంధ్రప్రదేశ్

తుఫానులోను ఆగని మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) దాతృత్వం

ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రెండు కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ కాకినాడ : మానవసేవే మాధవ సేవ అన్న నినాదాన్ని ఆచరిస్తూ… తన వంతు సహాయంగా సేవచేయాలనే ఉద్దేశ్యంతో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) నిరుపేద కుటుంబాలకు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సహాయం చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మొంథా తుఫాను ప్రభావంతో ఈదురుగాలులు వీస్తూ… వర్షం కురుస్తున్న వాటిని సైతం లెక్కచేయకుండా రెండు నిరుపేద కుటుంబాలకు 2 నెలలకు సరిపడా నిత్యవసర సరుకులు అందించారు. జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు ఆయన స్ఫూర్తితో జనసేన సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాకినాడ ఎటుమొగలోని 14వ డివిజన్ లో ఇటీవల మృతి చెందిన ఓలేటి భవాని కుటుంబ సభ్యులును సోమవారం కలిసి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యవసర వస్తువులను అందజేశారు. ఇప్పటి వరకు 297 మందికి సహాయం చేయడం జరిగిందన్నారు. అదే విధంగా జగన్నాధపురంలోని 25వ డివిజన్ లో ఇటీవల మృతి చెందిన దండుప్రోలు దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులును కలిసి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి కూడా రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యవసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా ఓలేటి భవాని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమలాంటి నిరుపేద కుటుంబాలను ఆపదలో ఆదుకుంటున్న జనసేన పార్టీలో సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్)కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటివరకు 300 కుటుంబాలకు తన దాతృత్వం చాటుకుంటున్నారని, కుటుంబ పెద్ద మరణించి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు, నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్నారన్నారు. తన సొంత నిధులతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారని, అటువంటి వ్యక్తి ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన మరియు బిజెపి పార్టీ నాయకులు కొక్కిలగెడ్డ గంగరాజు, పొన్నాడ నాగేశ్వరరావు, వీర మహిళలు బంటు లీల, సుజాత, మోనా జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రెండు కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ

కాకినాడ : మానవసేవే మాధవ సేవ అన్న నినాదాన్ని ఆచరిస్తూ… తన వంతు సహాయంగా సేవచేయాలనే ఉద్దేశ్యంతో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) నిరుపేద కుటుంబాలకు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సహాయం చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మొంథా తుఫాను ప్రభావంతో ఈదురుగాలులు వీస్తూ… వర్షం కురుస్తున్న వాటిని సైతం లెక్కచేయకుండా రెండు నిరుపేద కుటుంబాలకు 2 నెలలకు సరిపడా నిత్యవసర సరుకులు అందించారు. జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు ఆయన స్ఫూర్తితో జనసేన సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాకినాడ ఎటుమొగలోని 14వ డివిజన్ లో ఇటీవల మృతి చెందిన ఓలేటి భవాని కుటుంబ సభ్యులును సోమవారం కలిసి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యవసర వస్తువులను అందజేశారు. ఇప్పటి వరకు 297 మందికి సహాయం చేయడం జరిగిందన్నారు. అదే విధంగా జగన్నాధపురంలోని 25వ డివిజన్ లో ఇటీవల మృతి చెందిన దండుప్రోలు దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులును కలిసి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి కూడా రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యవసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా ఓలేటి భవాని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమలాంటి నిరుపేద కుటుంబాలను ఆపదలో ఆదుకుంటున్న జనసేన పార్టీలో సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్)కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటివరకు 300 కుటుంబాలకు తన దాతృత్వం చాటుకుంటున్నారని, కుటుంబ పెద్ద మరణించి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు, నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్నారన్నారు. తన సొంత నిధులతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారని, అటువంటి వ్యక్తి ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన మరియు బిజెపి పార్టీ నాయకులు కొక్కిలగెడ్డ గంగరాజు, పొన్నాడ నాగేశ్వరరావు, వీర మహిళలు బంటు లీల, సుజాత, మోనా జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.