తీన్మార్ మల్లన్న దాడిని ఖండించిన ముధోల్ బిసి నాయకులు
ముధోల్, జులై 16తెలంగాణ పున్నమి ప్రతినిధి):మండల కేంద్రంలో కొత్త బస్టాండ్ సమీపంలో బిసి ఐక్యవేదిక ఆధ్వర్యంలో బిసి బిడ్డ అయినా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై జరిగిన దాడిని తీవ్రంగా బుధవారం నాయకులు తీవ్రంగా ఖండించారు .ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న పై దాడి హేమమైన చర్య అని ఇట్లాంటి దాడులు మున్ముందు పునరావృతం కాకుండా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంఘ నాయకులు రోళ్ల రమేష్, అనిల్, తాటివార్ రమేష్, దశరథ్, కోరిపోతన్న, విట్టల్, లవన్, శ్రీనివాస్ గౌడ్, గడ్డం సుభాష్,అంజి గౌడ్, మోహన్ యాదవ్, యువ న్యాయవాది జుట్టు గజేందర్ తో పాటుబీసీ సంఘం నాయకులు తదితరులున్నారు