శ్రీకాళహస్తి, మార్చి 24 (పున్నమి న్యూస్): తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. వైసీపీ పాలనలో తిరుమల ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలు చోటుచేసుకున్నాయని ఆయన ఆరోపించారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న సమయంలో అన్యమత ప్రచారం, డిక్లరేషన్ వంటి కీలక అంశాలపై స్పందించని వైసీపీ నాయకులు, ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత మతపరమైన అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో టీటీడీ వ్యవహారాల నిర్వహణపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. తిరుమల క్షేత్ర గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యతను విస్మరించారని, కొన్ని నిర్ణయాలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కొన్నారు. తిరుమలలో ప్రసాదాల నాణ్యత, నిర్వహణలో లోపాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన, స్వామివారి ఆస్తుల పరిరక్షణలో కూడా గత పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. అలాగే తప్పుడు ప్రచారాలు, డీప్‌ఫేక్ వీడియోల ద్వారా రాజకీయ లాభాలు పొందాలని ప్రయత్నించడం తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఇప్పటికే అబద్ధాలను గుర్తించి తగిన తీర్పు ఇచ్చారని, భవిష్యత్తులో కూడా ఇటువంటి చర్యలకు గట్టి సమాధానం ఇస్తారని ఆయన స్పష్టం చేశారు. తిరుమల పవిత్రత, భక్తుల విశ్వాసాన్ని కాపాడటం కూటమి ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు.

తిరుమల పవిత్రత దెబ్బతీశారంటూ వైసీపీపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆగ్రహం