Sunday, 22 March 2026
  • Home  
  • తిరుమల కొండపై పోటెత్తిన భక్తుల రద్దీ — కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లు — శ్రీవారి దర్శనానికి 30 గంటలు
- తిరుపతి

తిరుమల కొండపై పోటెత్తిన భక్తుల రద్దీ — కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లు — శ్రీవారి దర్శనానికి 30 గంటలు

భక్తుల సౌకర్యాల కల్పనకు శ్రమిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది — వెలుపల క్యూ లైన్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుమల కొండపై భక్తుల రద్దీ పోటెత్తింది. వరుస సెలవులు రావడంతో శ్రీవారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. అధిక రద్దీ కారణంగా ఎటువంటి టోకెన్లు లేని భక్తులు స్వామివారి దర్శనం కోసం కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు. స్వామి వారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోందని టీటీడీ ప్రకటించింది. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు సౌకర్యాలు కల్పించే పనిలో టీటీడీ ఉద్యోగులు, సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో భక్తులకు అవసరమైన త్రాగునీరు, మజ్జిగ, పాలు, అన్న ప్రసాదాలను నిరంతరాయంగా అందిస్తున్నారు. మరోవైపు గదులు లభించని భక్తులు ఉచిత వసతి సముదాయాలలో లాకర్లు పొంది సేద తీరుతున్నారు. ఏడుకొండలస్వామి కి తలనీలాలు సమర్పించి మొక్కలు చెల్లించుకునేందుకూ భారీగా క్యూలు ఏర్పడుతున్నాయి. — క్యూలైన్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ : భక్తుల అధిక రద్దీ దృష్ట్యా అకస్మాత్తుగా అధికారులతో కలిసి క్యూ లైన్లును తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఆక్టోపస్ సర్కిల్, నారాయణగిరి షెడ్స్, ఔటర్ రింగ్ రోడ్, శిలాతోరణం సర్కిల్ లోని క్యూ లైన్లు పరిశీలించారు. భక్తుల బందోస్తును ఏర్పాట్లును పరిశీలించి అధికారులకు పలు సూచలను చేశారు. భక్తుల రద్దీని అంచనా వేస్తూ,భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలన్నారు.ఉదయం నుండి ఇప్పటి వరకు ఎంత మంది భక్తులు వచ్చారు.. రేపు, ఎల్లుండు ఎంత మంది వస్తున్నారు అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ క్యూలైన్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాలు పడుతుండటంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. అదేవిధంగా నాలుగు మాడవీధులు ను కాలినడకన తిరిగి ఏర్పాట్లు పరిశీలించారు. అలాగే ఇతర ప్రాంతాల నుండి శ్రీవారికి సేవ చేసేందుకు వచ్చిన భక్తులతో ఎస్పీ మాట్లాడుతూ క్యూలైన్ లో పరిస్థితి ఫై అడిగి తెలుసుకున్నారు.వర్షాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడైనా ఎదైన సమస్యలు వస్తే… వేంటనే పోలీసు వారితోపాటు ఇతర అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. సెలవు దినాలు ఎక్కువ రావడం తో భక్తులు అధికసంఖ్యలో వస్తారని, వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట అదనపు ఎస్పీ రామకృష్ణ,తిరుమల డిఎస్పి విజయ శేఖర్, సీఐలు విజయకుమార్, శ్రీ రాముడు, హరిప్రసాద్, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.

భక్తుల సౌకర్యాల కల్పనకు శ్రమిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది
— వెలుపల క్యూ లైన్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
తిరుమల కొండపై భక్తుల రద్దీ పోటెత్తింది. వరుస సెలవులు రావడంతో శ్రీవారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. అధిక రద్దీ కారణంగా ఎటువంటి టోకెన్లు లేని భక్తులు స్వామివారి దర్శనం కోసం కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు. స్వామి వారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోందని టీటీడీ ప్రకటించింది. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు సౌకర్యాలు కల్పించే పనిలో టీటీడీ ఉద్యోగులు, సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో భక్తులకు అవసరమైన త్రాగునీరు, మజ్జిగ, పాలు, అన్న ప్రసాదాలను నిరంతరాయంగా అందిస్తున్నారు. మరోవైపు గదులు లభించని భక్తులు ఉచిత వసతి సముదాయాలలో లాకర్లు పొంది సేద తీరుతున్నారు. ఏడుకొండలస్వామి కి తలనీలాలు సమర్పించి మొక్కలు చెల్లించుకునేందుకూ భారీగా క్యూలు ఏర్పడుతున్నాయి.
— క్యూలైన్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ :
భక్తుల అధిక రద్దీ దృష్ట్యా అకస్మాత్తుగా అధికారులతో కలిసి క్యూ లైన్లును తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
ఆక్టోపస్ సర్కిల్, నారాయణగిరి షెడ్స్, ఔటర్ రింగ్ రోడ్, శిలాతోరణం సర్కిల్ లోని క్యూ లైన్లు పరిశీలించారు. భక్తుల
బందోస్తును ఏర్పాట్లును పరిశీలించి అధికారులకు పలు సూచలను చేశారు.
భక్తుల రద్దీని అంచనా వేస్తూ,భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలన్నారు.ఉదయం నుండి ఇప్పటి వరకు ఎంత మంది భక్తులు వచ్చారు.. రేపు, ఎల్లుండు ఎంత మంది వస్తున్నారు అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ క్యూలైన్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా అధికారులకు పలు సూచనలు చేశారు.
వర్షాలు పడుతుండటంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు.
అదేవిధంగా నాలుగు మాడవీధులు ను కాలినడకన తిరిగి ఏర్పాట్లు పరిశీలించారు. అలాగే ఇతర ప్రాంతాల నుండి శ్రీవారికి సేవ చేసేందుకు వచ్చిన భక్తులతో ఎస్పీ మాట్లాడుతూ క్యూలైన్ లో పరిస్థితి ఫై అడిగి తెలుసుకున్నారు.వర్షాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడైనా ఎదైన సమస్యలు వస్తే… వేంటనే పోలీసు వారితోపాటు ఇతర అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.
సెలవు దినాలు ఎక్కువ రావడం తో భక్తులు అధికసంఖ్యలో వస్తారని, వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట అదనపు ఎస్పీ రామకృష్ణ,తిరుమల డిఎస్పి విజయ శేఖర్,
సీఐలు విజయకుమార్,
శ్రీ రాముడు, హరిప్రసాద్, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.