తిమ్మిరెడ్డి పల్లి సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం తిమ్మిరెడ్డిపల్లి గ్రామపంచాయతీలో సేవా పక్షోత్సవాల భాగంగా ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు చౌటపల్లి విక్రమ్ కిషోర్ హాజరై ప్రారంభించారు. అనంతరం సచివాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కుర్ర వెంకట సుబ్రమణ్య వరప్రసాద్, సేవా పక్షోత్సవాల మండల కన్వీనర్ గంగవల్లి శ్యామ్ శేఖర్, కో-కన్వీనర్లు సయ్యద్ మీర్ జాఫర్ అలీ, అనిల్ బొంకురి, మండల అధ్యక్షుడు తాడిపత్రి శ్రీనివాసరావు, టౌన్ అధ్యక్షురాలు కొత్తపల్లి విజయకుమారి, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు సింగం కృష్ణ ప్రసాద్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తోట నారాయణ తదితరులు పాల్గొన్నారు.


