Monday, 23 March 2026
  • Home  
  • తాళ్లపూడి మండలంలో జూదం అడ్డుకట్ట – రూ.81,150 నగదు స్వాధీనం
- తూర్పు గోదావరి

తాళ్లపూడి మండలంలో జూదం అడ్డుకట్ట – రూ.81,150 నగదు స్వాధీనం

తాళ్లపూడి మండలం ప్రక్కిలంక గ్రామ శివారులో తాడిపూడి కాలువగట్టు సమీపంలో కొంతమంది వ్యక్తులు కోత-బంతి అనే జూదం ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు తాళ్లపూడి ఎస్సై టి. రామకృష్ణ సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. ఈ దాడిలో నలుగురు నిందితుల నుంచి రూ.81,150 నగదు మరియు 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మండలంలో జూదం, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఎప్పటికప్పుడు డ్రోన్ నిఘాతో పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు.

తాళ్లపూడి మండలం ప్రక్కిలంక గ్రామ శివారులో తాడిపూడి కాలువగట్టు సమీపంలో కొంతమంది వ్యక్తులు కోత-బంతి అనే జూదం ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు తాళ్లపూడి ఎస్సై టి. రామకృష్ణ సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు.
ఈ దాడిలో నలుగురు నిందితుల నుంచి రూ.81,150 నగదు మరియు 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
మండలంలో జూదం, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఎప్పటికప్పుడు డ్రోన్ నిఘాతో పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.