ఖమ్మం పున్నమి ప్రతి నిధి
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (AIPA)ఆల్ ఇండియా టాపర్ గా ఎంపిక అయిన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం లోగల అరేంపుల గ్రామానికి చెందిన తాల్లూరి పల్లవి ని మంగళవారం నాడు బీజేపీ నేతలు కలసి అభినందనలు తెలియ జేశారు. అరేంపు ల లోని ఆమె స్వగృహం నందు బీజేపీ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు జాతోతూ మధు నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో
నిజమా బాద్ రూరల్ బీజేపీ శాసన సభ్యులు ధనపాల్ సూర్య నారాయణ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవారావు, జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు పాలేరు బీజేపీ అసెంబ్లీ ఇంచార్జి, కంటేస్టెడ్ అభ్యర్థి నున్న రవికుమార్ తో పాటు పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


