పున్నమి ప్రతినిధి
తాండూరులో కల్తీ కోవా స్థావరంపై దాడి 120 కిలోల కోవా స్వాధీనం, ఇద్దరి అరెస్ట్*
వికారాబాద్ జిల్లా తాండూరు: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కల్తీ కోవాను తయారు చేస్తున్న స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో సుమారు 120 కిలోల కల్తీ కోవాను స్వాధీనం చేసుకొని, ఇద్దరు నిందితులు
రాజస్థాన్ కు చెందిన ప్రకాష్ విష్ణు, హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్ సల్మాన్ లను అరెస్ట్ చేశారు
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ ఆహార కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలు వద్ద ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.



