నందిగామ పట్టణం, తొమ్మిదవ వార్డు తమ్మవరపు మంగపతి సతీమణి చంద్రమ్మ ఇటీవల మరణించిన విషాద వార్త తెలుసుకున్న నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, తమ్మవరపు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చంద్రమ్మ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించామని, కుటుంబానికి ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నం బుచ్చిబాబు, వీసం జగదీష్ పాల్గొన్నారు.

తమ్మవరపు మంగపతి కుటుంబాన్ని పరామర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి