డ్రగ్స్ వ్యసన నివారణ దినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూరులో అవగాహన ర్యాలీ
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వాడకం మరియు రవాణా నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రొద్దుటూరులో గురువారం సాయంత్రం 3:30 గంటలకు అవగాహన ర్యాలీ, అనంతరం 4:00 నుండి 5:00 గంటల వరకు అన్నీబీసెంట్ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండులో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలు ప్రొద్దుటూరు DSP శ్రీమతి భావన గారి ఆధ్వర్యంలో జరుగనున్నాయి.
మున్సిపల్ కమిషనర్ శ్రీ సి. రవిచంద్రా రెడ్డి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రూపానంద్, ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీ వినోద్, డాక్టర్ టీ.డి. వరుణ్ కుమార్ రెడ్డి (NTR వైద్య సేవ ఎగ్జిక్యూటివ్ సభ్యులు) పాల్గొననున్నారు. ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని DSP భావన కోరారు.