డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీడీగా బాధ్యతలు స్వీకరించిన కె.రజిత.
*విశాఖ పట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*.
విశాఖలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డెరెక్టర్గా కె.రజిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె విజయనగరం, అనకాపల్లి ప్రాంత డ్రగ్స్ ఇన్స్పెక్టర్గా పని చేసిన విషయం తెలిసిందే. 2013లో ఆమెకు అసిస్టెంట్ డ్కెరెక్టర్గా పదోన్నతి లభించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 2013నుంచి 2016వరకు అసిస్టెంట్ డైరెక్టర్ గా, 2017 నుంచి 2022వరకు విశాఖ ఏడీగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం ఆమె విజయనగరం ఏడీగా ఇప్పటి వరకు విధులు నిర్వహించి, ప్రస్తుతం ఉద్యోగోన్నతి సాధించారు. ఉత్తమ ఉద్యోగిణిగా పంద్రాగస్టు దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయనగరం కలెక్టర్ నుంచి ఆమె ప్రశంసాపత్రాన్ని కూడా స్వీకరించారు. ఆమె బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది ఆమెను పుష్ప గుచ్చాలు అందించి అభినందించారు.

డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీడీగా బాధ్యతలు స్వీకరించిన కె.రజిత.
డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీడీగా బాధ్యతలు స్వీకరించిన కె.రజిత. *విశాఖ పట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*. విశాఖలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డెరెక్టర్గా కె.రజిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె విజయనగరం, అనకాపల్లి ప్రాంత డ్రగ్స్ ఇన్స్పెక్టర్గా పని చేసిన విషయం తెలిసిందే. 2013లో ఆమెకు అసిస్టెంట్ డ్కెరెక్టర్గా పదోన్నతి లభించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 2013నుంచి 2016వరకు అసిస్టెంట్ డైరెక్టర్ గా, 2017 నుంచి 2022వరకు విశాఖ ఏడీగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం ఆమె విజయనగరం ఏడీగా ఇప్పటి వరకు విధులు నిర్వహించి, ప్రస్తుతం ఉద్యోగోన్నతి సాధించారు. ఉత్తమ ఉద్యోగిణిగా పంద్రాగస్టు దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయనగరం కలెక్టర్ నుంచి ఆమె ప్రశంసాపత్రాన్ని కూడా స్వీకరించారు. ఆమె బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది ఆమెను పుష్ప గుచ్చాలు అందించి అభినందించారు.

