కో-ఆపరేటివ్ సొసైటీలో నెలకొన్న అసంపూర్ణ సమస్యల పరిష్కారానికి జెన్కో యంత్రాంగం శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ జెన్కో జనరల్ సెక్రెటరీ తిప్పారపు రమేష్ పేర్కొన్నారు. క్రెడిట్ సొసైటీ ఎన్నికలు జరుగుతాయని, ఉన్న డైరెక్టర్ల పదవి కాలం ముగిసిందనే ప్రచారంతో రుణాలు నిలిపివేయడం శ్రేయస్కరం కాదన్నారు. డైరెక్టర్ల స్థానంలో ఓ ప్రత్యేక అధికారిని నియమించి, ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించాల్సిన అవసరం ఉందన్నారు. సొసైటీ కార్యాలయానికి ఇంతవరకు ఇంచార్జి ని ప్రకటించక పోవడం శోచనీయమన్నారు. కార్మికులు, ఉద్యోగుల పిల్లల పెళ్లిళ్లు, ఆరోగ్యరీత్యా లోన్స్ పెట్టుకొని ఉన్నారు. కానీ ఇంతవరకు ఆ సొసైటీ లోన్స్ గురించి ఎవరూ మాట్లాడకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గమనించి, సమస్యను పరిష్కరించాలని రమేష్ కోరారు.

డైరెక్టర్ ల స్థానంలో ప్రత్యేక అధికారిని నియమించాలి : ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ జన్కో జనరల్ సెక్రటరీ రమేష్