Friday, 6 February 2026
  • Home  
  • డిసెంబర్ లో కొత్త ఆధార్ కార్డు వ్యక్తిగత వివరాలన్నీ తొలగింపు
- ఆంధ్రప్రదేశ్

డిసెంబర్ లో కొత్త ఆధార్ కార్డు వ్యక్తిగత వివరాలన్నీ తొలగింపు

డిసెంబర్ లో కొత్త ఆధార్ కార్డు వ్యక్తిగత వివరాలన్నీ తొలగింపు , న్యూఢిల్లీ : భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డును పూర్తిగా పునఃరూపకల్పన చేయడానికి సిద్ధమైంది. డిసెంబర్ నెలలో విడుదల కాబోయే ఈ కొత్త ఆధార్ కార్డు లో ఫోటో, QR కోడ్ మాత్రమే ఉంటాయి. ఇప్పటివరకు కార్డు మీద కనిపించే పేరు, ఆధార్ నంబర్, చిరునామా, పుట్టిన తేదీ వంటి ముద్రిత వ్యక్తిగత వివరాలను పూర్తిగా తొలగించనున్నారు. ఈ కొత్త కార్డులో ఉండే ఎన్‌క్రిప్టెడ్ QR కోడ్ ద్వారానే అవసరమైన సమాచారం ధృవీకరణ చేయాల్సి ఉంటుంది. దీనిని కేవలం అధికారిక పద్ధతుల ద్వారా మాత్రమే స్కాన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. UIDAI అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హోటళ్ళు, కార్యాలయాలు, ఈవెంట్‌ లలో ఆధార్ కార్డు ఫోటో కాపీలు తీసుకొని నిల్వ చేసేవారికి ఇది పెద్ద పరిరక్షణగా మారనుంది. ఈ కొత్త రూపకల్పనతో గోప్యత పెరగడమే కాకుండా డేటా దుర్వినియోగాన్ని పూర్తిగా అరికట్టడమే లక్ష్యమని సంబధిత అధికారులు పేర్కొన్నారు.

డిసెంబర్ లో కొత్త ఆధార్ కార్డు వ్యక్తిగత వివరాలన్నీ తొలగింపు
, న్యూఢిల్లీ : భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డును పూర్తిగా పునఃరూపకల్పన చేయడానికి సిద్ధమైంది. డిసెంబర్ నెలలో విడుదల కాబోయే ఈ కొత్త ఆధార్ కార్డు లో ఫోటో, QR కోడ్ మాత్రమే ఉంటాయి. ఇప్పటివరకు కార్డు మీద కనిపించే పేరు, ఆధార్ నంబర్, చిరునామా, పుట్టిన తేదీ వంటి ముద్రిత వ్యక్తిగత వివరాలను పూర్తిగా తొలగించనున్నారు. ఈ కొత్త కార్డులో ఉండే ఎన్‌క్రిప్టెడ్ QR కోడ్ ద్వారానే అవసరమైన సమాచారం ధృవీకరణ చేయాల్సి ఉంటుంది. దీనిని కేవలం అధికారిక పద్ధతుల ద్వారా మాత్రమే స్కాన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
UIDAI అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హోటళ్ళు, కార్యాలయాలు, ఈవెంట్‌ లలో ఆధార్ కార్డు ఫోటో కాపీలు తీసుకొని నిల్వ చేసేవారికి ఇది పెద్ద పరిరక్షణగా మారనుంది. ఈ కొత్త రూపకల్పనతో గోప్యత పెరగడమే కాకుండా డేటా దుర్వినియోగాన్ని పూర్తిగా అరికట్టడమే లక్ష్యమని సంబధిత అధికారులు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.