పువ్వాడ నాగేంద్ర కుమార్
(ఖమ్మం జిల్లా పున్నమి స్టాఫ్ రిపోర్టర్ )
వినాయక చవితి వేడుకలని ఉమ్మడి ఖమ్మం జిల్లా లో ని ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఖమ్మం నగరం లో ని ప్రముఖ మెడికల్ అకాడమీ అయినా
డాక్టర్స్ మెడికల్ అకాడమీ లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నరూ. బాలికల క్యాంపస్ లో జరిగిన గణపయ్య పూజలో శ్రీమతి ఈగ లక్ష్మి భరణి దంపతులు పాల్గొనగా బాలుర క్యాంపస్ లో జరిగిన గణపయ్య పూజలో శ్రీమతి రాయల ఈశ్వరీ సతీష్ దంపతులు పాల్గొన్నారు.
ఈ సందర్భముగా శ్రీ ఈగ భరణి లక్ష్మి దంపతులు,, శ్రీ రాయల సతీష్ ఈశ్వరీ దంపతులు వారి కళాశాల విద్యార్థిని, విద్యార్థులకి సిబ్బంది కి,తెలంగాణ రాష్ట్ర ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసారు.


