కొత్త బస్టాండ్ నుంచి శంకర్ విలాస్ సెంటర్ వరకు షాప్ బోర్డులను తొలగిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, మున్సిపల్ సిబ్బంది
ట్రాఫిక్ నుంచి విముక్తి కల్పిస్తూ తనకంటూ ముద్ర వేసుకుంటున్న ట్రాఫిక్ ఎస్ఐ
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్న ప్రజలకు, వాహనదారులకు ఉపశమనం కలిగించే విధంగా సూర్యాపేట మున్సిపల్ సిబ్బంది, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం సమన్వయంతో కలిసి ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలను విముక్తి కలిగిస్తున్నారు. ఈ బోర్డులు తొలగించడం పట్ల పట్టణ ప్రజలు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అలాగే దంతాలపల్లి సూర్యాపేట రోడ్డు మీదుగా సూర్యాపేటకు వచ్చే మార్గంలో విపరీతంగా భారీ వాహనాలు పోలీస్ సిబ్బంది రోడ్డు డైవర్షన్ చేయక పోవడంతో అనవసరంగా వాహనాలు పట్టణంలోకి ప్రవేశించి ట్రాఫిక్ సమస్యను సృష్టిస్తున్నాయి దానివల్ల దుమ్ము, ధూళి తో పాటు ట్రాఫిక్ సమస్యతో సూర్యాపేట పట్టణానికి రోజుకు వేలాదిమంది తమ సొంత పని నిమిత్తం వస్తుంటారు. కాబట్టి భారీ వాహనాలను డైవర్షన్ చేసి ప్రజలకు ఉపశమనం కలిగించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.


