కామారెడ్డి, 22 సెప్టెంబర్,పున్నమి ప్రతినిధి :
ఊహించని వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న కామారెడ్డి జిల్లా ప్రజలకు సహాయంగా, తెలంగాణ పిఆర్టియు ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ రూ.7,06,011 విలువైన డీడీని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్‌కి అందజేసింది. ఈ సందర్భంగా కలెక్టర్ సంఘ సభ్యులను అభినందించారు. పిఆర్టియు జిల్లా అధ్యక్షులు కుశాల్ మాట్లాడుతూ, ఉపాధ్యాయ సమస్యలతో పాటు సామాజిక సేవలో భాగస్వామ్యం అవుతున్నామన్నారు. పాఠశాలలు దత్తత, రక్తదానం, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజు, టిఆర్టియు నేతలు, జిల్లా, మండల బాధ్యులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలకు తోడ్పడిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.


