Friday, 6 February 2026
  • Home  
  • టంగుటూరులో 469వ ఉరుసు మహోత్సవనీకి ముఖ్యఅతిథిగా పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి
- అన్నమయ్య

టంగుటూరులో 469వ ఉరుసు మహోత్సవనీకి ముఖ్యఅతిథిగా పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి

నందలూరు నవంబర్ 30, (ఎల్లో సింగం ప్రతినిధి) టంగుటూరు గ్రామంలోని శ్రీ హజరత్ ఖాదర వల్లి దర్గా ప్రాంగణంలో 469వ ఉరుసు మహోత్సవం ఆదివారం నాడు అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డిని గ్రామస్తులు,ఉరుసు కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.గ్రామ వీధులు ఆహ్వాన నినాదాలతో మార్మోగగా,బాణసంచా, బ్యాండ్‌బాజాలు,శాల్వతో సత్కరించి గజమాల వేసి మేడా విజయ శేఖర్ రెడ్డికి ఘన సత్కారం అందించారు. గ్రామం మొత్తం పండుగ వాతావరణంతో కళకళలాడింది.మేడా విజయ శేఖర్ రెడ్డి అడుగు పెట్టిన ప్రతి చోట ప్రజలు భారీ సంఖ్యలో చేరి అభినందనలు తెలియజేశారు.ఆయనతో పలకరించేందుకు గ్రామస్థులు ఎగబడి,తమ సమస్యలు, అభిప్రాయాలు వివరించగా, మేడా ఆత్మీయంగా ప్రతి ఒక్కరినీ వినడం ప్రత్యేకతగా నిలిచింది.అనంతరం దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన మేడా విజయ శేఖర్ రెడ్డి,దేశ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,ఆంధ్రప్రదేశ్ పురోగతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,రాష్ట్ర అభివృద్ధిలో ఐటీ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్న మంత్రి నారా లోకేష్,ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో మరిన్ని విజయాలు చేకూరాలని ఖాదర్ వల్లీ దయను కోరుతూ ప్రార్థనలు చేశారు.ప్రాంతం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు మహోత్సవానికి తరలివచ్చి పాల్గొన్నారు.టంగుటూరు దర్గా చరిత్ర,ఉరుసు ప్రత్యేకతలపై కమిటీ సభ్యులు వివరించగా, శతాబ్దాలుగా నిర్వహిస్తున్న ఈ ఉరుసు సామరస్యానికి, సౌహార్దానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నందలూరు మండల మాజీ ఎంపీపీ భువన బోయిన లక్ష్మీ నరసయ్య, టంగుటూరు ఎంపీటీసీ భువన బోయిన పెంచలయ్య, టిడిపి నాయకులు గుజ్జుల ఈశ్వరయ్య, టిడిపి మహిళా నాయకురాలు షేక్ షర్మిల, ఎం.ఎస్ ఖాదర్ వల్లీ,చుక్క వెంకటేష్,నీటి సంఘం మాజీ అధ్యక్షుడు అల్లబకాష్,ముస్లిం కమిటీ ప్రెసిడెంట్ సయ్యద్ నిజాం,ఓబిలి ముస్లిం కమిటీ సెక్రటరీ ఖాదర్ వలీ,బక్షు సాబ్, గౌస్ పీర్,ఎంఆర్పిఎస్ నందలూరు మండల అధ్యక్షుడు కొండయ్య, ఎల్లమ్మరాజుపల్లి శ్రీనివాసులు రెడ్డి,టిడిపి దళిత నాయకుడు సాతపల్లి వెంకీ, టంగుటూరు హరి,టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు,అభిమానులు పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేశారు.

నందలూరు నవంబర్ 30, (ఎల్లో సింగం ప్రతినిధి)

టంగుటూరు గ్రామంలోని శ్రీ హజరత్ ఖాదర వల్లి దర్గా ప్రాంగణంలో 469వ ఉరుసు మహోత్సవం ఆదివారం నాడు అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డిని గ్రామస్తులు,ఉరుసు కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.గ్రామ వీధులు ఆహ్వాన నినాదాలతో మార్మోగగా,బాణసంచా, బ్యాండ్‌బాజాలు,శాల్వతో సత్కరించి గజమాల వేసి మేడా విజయ శేఖర్ రెడ్డికి ఘన సత్కారం అందించారు.
గ్రామం మొత్తం పండుగ వాతావరణంతో కళకళలాడింది.మేడా విజయ శేఖర్ రెడ్డి అడుగు పెట్టిన ప్రతి చోట ప్రజలు భారీ సంఖ్యలో చేరి అభినందనలు తెలియజేశారు.ఆయనతో పలకరించేందుకు గ్రామస్థులు ఎగబడి,తమ సమస్యలు, అభిప్రాయాలు వివరించగా, మేడా ఆత్మీయంగా ప్రతి ఒక్కరినీ వినడం ప్రత్యేకతగా నిలిచింది.అనంతరం దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన మేడా విజయ శేఖర్ రెడ్డి,దేశ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,ఆంధ్రప్రదేశ్ పురోగతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,రాష్ట్ర అభివృద్ధిలో ఐటీ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్న మంత్రి నారా లోకేష్,ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో మరిన్ని విజయాలు చేకూరాలని ఖాదర్ వల్లీ దయను కోరుతూ ప్రార్థనలు చేశారు.ప్రాంతం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు మహోత్సవానికి తరలివచ్చి పాల్గొన్నారు.టంగుటూరు దర్గా చరిత్ర,ఉరుసు ప్రత్యేకతలపై కమిటీ సభ్యులు వివరించగా, శతాబ్దాలుగా నిర్వహిస్తున్న ఈ ఉరుసు సామరస్యానికి, సౌహార్దానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నందలూరు మండల మాజీ ఎంపీపీ భువన బోయిన లక్ష్మీ నరసయ్య, టంగుటూరు ఎంపీటీసీ భువన బోయిన పెంచలయ్య, టిడిపి నాయకులు గుజ్జుల ఈశ్వరయ్య, టిడిపి మహిళా నాయకురాలు షేక్ షర్మిల, ఎం.ఎస్ ఖాదర్ వల్లీ,చుక్క వెంకటేష్,నీటి సంఘం మాజీ అధ్యక్షుడు అల్లబకాష్,ముస్లిం కమిటీ ప్రెసిడెంట్ సయ్యద్ నిజాం,ఓబిలి ముస్లిం కమిటీ సెక్రటరీ ఖాదర్ వలీ,బక్షు సాబ్, గౌస్ పీర్,ఎంఆర్పిఎస్ నందలూరు మండల అధ్యక్షుడు కొండయ్య, ఎల్లమ్మరాజుపల్లి శ్రీనివాసులు రెడ్డి,టిడిపి దళిత నాయకుడు సాతపల్లి వెంకీ, టంగుటూరు హరి,టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు,అభిమానులు పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.