జూలై 24 జాబ్ మేళా నిర్వహణ…. పెద్దపల్లి జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతిరావు
పెద్దపల్లి, జులై 19, పున్నమి ప్రతినిధి: నిరుద్యోగ యువతీ, యువకులకు పెద్దపల్లి జిల్లా నందు కృషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్ లో ఉద్యోగాలు కల్పించుటకు ఈనెల 24న గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రూమ్ నెం.225 పైన నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతి రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కృషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్ సంస్థలో (67) పోస్టులకు ఇంటర్యులు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి పోస్టుల పేరు సేల్స్ ఎక్సిక్యూటివ్ (60) ఫీల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ (04), హెచ్ ఆర్ మేనేజర్స్ (02) ఆఫీస్ బాయ్ (01) లు ఖాళీలు ఉన్నాయని ఇట్టి పోస్టులకు విద్యా అర్హత ఎస్ఎస్సి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ లేదా ఎంబీఏ, ఆపై చదివిన వారు అర్హులని, వీరి వయస్సు 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఉండాలని తెలిపారు. ఇట్టి పోస్టులకు యువతీ, యువకులు అర్హతలని పేర్కొన్నారు.
ఆసక్తి ఉన్నవారు జూలై 24న ఉదయం 11 గంటలకు సర్టిఫికేట్స్ జిరాక్స్ లతో సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం రూమ్ నెం.225 పైన గల జిల్లా ఉపాధి కార్యాలయం, వచ్చి తమ పేరు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 9391420932, 8985336947, 8121262441 నందు సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతిరావు ఆ ప్రకటనలో తెలిపారు.


