*మాగంటి గోపినాథ్ తన భార్య మాలినీదేవికి విడాకులు ఇవ్వలేదని, ఇప్పటికీ మా అమ్మ మాగంటి గోపినాథ్ భార్యనేనని, అలాంటపుడు సునీత భార్య ఎలా అవుతుందని గోపినాథ్ మొదటి భార్య కొడుకు తారక్ ప్రద్యుమ్న ప్రశ్నించాడు.*
*తన తండ్రి సునీతను పెళ్లి చేసుకోలేదని, కేవలం లివ్ ఇన్ రిలేషన్షిప్ లోనే ఉన్నారని, తన తండ్రికి అసలైన వారసుడిని తానేనని అన్నారు.*
న్యాయబద్దంగా ఎమ్మెల్యే టిక్కెట్టు తన తల్లికి రావాలని, సునీత తన అనుచరులతో తమని బెదిరించారని, వెంటనే ఆమె నామినేషన్ రద్దు చేయాలని ప్రద్యుమ్న డిమాండ్ చేశాడు. అయితే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణించడంతో ఆ స్థానానికి ఉపఎన్నికలు ఏర్పడ్డాయి. నిన్నటితో నామినేషన్ ప్రక్రియ కూడా ముగియగా… నేడు బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై ఈ ఆరోపణలు రావడం రాజకీయాల్లో కలకలం రేగింది. అయితే ఈ ఆరోపణలపై సునీత స్పందించాల్సి ఉంది.


