Sunday, 7 December 2025
  • Home  
  • జీవీఎంసీ కౌన్సిల్ లో గళం వినిపించిన గంకల కవితా అప్పారావు యాదవ్
- విశాఖపట్నం

జీవీఎంసీ కౌన్సిల్ లో గళం వినిపించిన గంకల కవితా అప్పారావు యాదవ్

48 వ వార్డులో మసకబారిన వీధి దీపాల స్థానంలో నూతన వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరిన గంకల పారిశుధ్య కార్మికుల సంఖ్య పెంచాలని,ప్రధాన జంక్షన్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనీ వినతి అందజేత వార్డు పర్యటనకు రావాలని మేయర్,జీవీఎంసీ కమీషనర్ ను కోరిన గంకల జీవీఎంసీ కౌన్సిల్ హాల్ శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో 48వ వార్డు కార్పొరేటర్,జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్,జీవీఎంసీ బీజేపీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు యాదవ్ వార్డు సమస్యలపై గళం వినిపించారు. వార్డులో చాలావరకు మౌలిక వసతులు సమస్యలు లోపం ఉందని వార్డు అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులు కల్పించాలని కోరారు.48 వార్డులో కొండ ప్రాంతం కావడంతో వీధి దీపాలు లేకపోవడంతో చీకటి ప్రదేశాలు ఎక్కువగా ఉండడంతో చిల్లర దొంగతనాలు,ఆటో బ్యాటరీలు దొంగతనాలు మేడల మీద పడుకునే సమయంలో చిల్లర దొంగతనాలు చేయడం జరుగుతుందని, చీకటి ప్రదేశం ఎక్కువగా నెలకొనడం వలన ఆకతాయిల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని వార్డులో 70 ఎంఎం వీధి దీపాలు, రింగ్ పోల్స్, సోలార్ వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు.వార్డులో జీవీఎంసీ మేయర్ పర్యటన చేసి,మౌలిక వసతులు కల్పనకు కృషి చేయాలని కోరారు. అందులో భాగంగా పైన తెలిపిన సమస్యలపై జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఇంచార్జ్ కమిషనర్ హరేంద్ర ప్రసాద్ కు వినతి అందజేసి త్వరితగతిన సమస్యలు పరిష్కారం చూపాలని కోరారు.వార్డులో ప్రధాన జంక్షన్ లు కాకుండా చిన్న చిన్న ప్రాంతాలలో 6 మీటర్ల జిఐ పోల్స్ ను ఏర్పాటుచేసి వాటికి నూతన ఎల్ఈడి వీధి దీపాలను ఏర్పాటు చేసి వార్డును చీకటి రహిత ప్రాంతంగా నెలకొల్పాలని కోరారు. కొండవాలు ప్రాంతం కావడంతో తక్కువ మంది పారిశుధ్య కార్మికులతో వార్డులో పారిశుధ్య సమస్య పూర్తిగా పరిష్కారం కావడం లేదని అదనంగా పారిశుధ్య కార్మికులు పెంచాలని,పారిశుధ్య పనులకు కావాల్సిన పనిముట్లను ఏర్పాటు చేయాలనీ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,స్మశాన వాటికను కోట్ల రూపాయల జీవీఎంసీ నిధులతో అభివృద్ధి చేయడం జరిగిందని ప్రభుత్వ ఆస్తులు వద్ద కనీస సెక్యూరిటీ లేక ఆకతాయిలు,మందుబాబులు ప్రభుత్వ ఆస్తులను ద్వంసం చేసి అక్కడికి వచ్చే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోగ్య కేంద్రం,స్మశాన వాటిక వద్ద సెక్యూరిటీ గార్డును,సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని,ప్రధాన జంక్షన్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని, వార్డులో నూతనంగా టెండర్ల పనులు మొదలు పెట్టాలని,వార్డు అభివృద్ధిలో భాగంగా ఉన్న సమస్యలపై నూతనంగా టెండర్లను పిలవాలని కోరారు.వార్డు పర్యటనకు రావాలని మేయర్,జీవీఎంసీ కమీషనర్ ను కోరారు.ఈ సమస్యలపై మేయర్ సానుకూలంగా స్పందించారని గంకల కవితా అప్పారావు యాదవ్ తెలిపారు.

48 వ వార్డులో మసకబారిన వీధి దీపాల స్థానంలో నూతన వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరిన గంకల

పారిశుధ్య కార్మికుల సంఖ్య పెంచాలని,ప్రధాన జంక్షన్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనీ వినతి అందజేత

వార్డు పర్యటనకు రావాలని మేయర్,జీవీఎంసీ కమీషనర్ ను కోరిన గంకల

జీవీఎంసీ కౌన్సిల్ హాల్ శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో 48వ వార్డు కార్పొరేటర్,జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్,జీవీఎంసీ బీజేపీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు యాదవ్ వార్డు సమస్యలపై గళం వినిపించారు. వార్డులో చాలావరకు మౌలిక వసతులు సమస్యలు లోపం ఉందని వార్డు అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులు కల్పించాలని కోరారు.48 వార్డులో కొండ ప్రాంతం కావడంతో వీధి దీపాలు లేకపోవడంతో చీకటి ప్రదేశాలు ఎక్కువగా ఉండడంతో చిల్లర దొంగతనాలు,ఆటో బ్యాటరీలు దొంగతనాలు మేడల మీద పడుకునే సమయంలో చిల్లర దొంగతనాలు చేయడం జరుగుతుందని, చీకటి ప్రదేశం ఎక్కువగా నెలకొనడం వలన ఆకతాయిల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని వార్డులో 70 ఎంఎం వీధి దీపాలు, రింగ్ పోల్స్, సోలార్ వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు.వార్డులో జీవీఎంసీ మేయర్ పర్యటన చేసి,మౌలిక వసతులు కల్పనకు కృషి చేయాలని కోరారు. అందులో భాగంగా పైన తెలిపిన సమస్యలపై జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఇంచార్జ్ కమిషనర్ హరేంద్ర ప్రసాద్ కు వినతి అందజేసి త్వరితగతిన సమస్యలు పరిష్కారం చూపాలని కోరారు.వార్డులో ప్రధాన జంక్షన్ లు కాకుండా చిన్న చిన్న ప్రాంతాలలో 6 మీటర్ల జిఐ పోల్స్ ను ఏర్పాటుచేసి వాటికి నూతన ఎల్ఈడి వీధి దీపాలను ఏర్పాటు చేసి వార్డును చీకటి రహిత ప్రాంతంగా నెలకొల్పాలని కోరారు. కొండవాలు ప్రాంతం కావడంతో తక్కువ మంది పారిశుధ్య కార్మికులతో వార్డులో పారిశుధ్య సమస్య పూర్తిగా పరిష్కారం కావడం లేదని అదనంగా పారిశుధ్య కార్మికులు పెంచాలని,పారిశుధ్య పనులకు కావాల్సిన పనిముట్లను ఏర్పాటు చేయాలనీ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,స్మశాన వాటికను కోట్ల రూపాయల జీవీఎంసీ నిధులతో అభివృద్ధి చేయడం జరిగిందని ప్రభుత్వ ఆస్తులు వద్ద కనీస సెక్యూరిటీ లేక ఆకతాయిలు,మందుబాబులు ప్రభుత్వ ఆస్తులను ద్వంసం చేసి అక్కడికి వచ్చే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోగ్య కేంద్రం,స్మశాన వాటిక వద్ద సెక్యూరిటీ గార్డును,సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని,ప్రధాన జంక్షన్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని, వార్డులో నూతనంగా టెండర్ల పనులు మొదలు పెట్టాలని,వార్డు అభివృద్ధిలో భాగంగా ఉన్న సమస్యలపై నూతనంగా టెండర్లను పిలవాలని కోరారు.వార్డు పర్యటనకు రావాలని మేయర్,జీవీఎంసీ కమీషనర్ ను కోరారు.ఈ సమస్యలపై మేయర్ సానుకూలంగా స్పందించారని గంకల కవితా అప్పారావు యాదవ్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.