*జీఎస్టీ సంస్కరణలు పేద-మధ్య తరగతి ప్రజల అభ్యదయానికి శ్రీరామ రక్షా*
*ప్రజారోగ్య రంగంలో 18% నుంచి 0% శాతానికి జీఎస్టీ సంస్కరణలు*
*అంగరంగ వైభవంగా మోదీ,నిర్మలా సీతారామన్, చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలుపుతూ భారీ ర్యాలీ*
*-కోలా ఆనంద్,సామంచి శ్రీనివాస్,బీజేపీ నేతలు*
శ్రీకాళహస్తి,సెప్టెంబర్(పున్నమి ప్రతినిధి):
శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వాడవాడలా ప్రధాని నరేంద్ర మోదీకీ,ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలుపుతూ భారీ ఎత్తున ర్యాలీలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.మోదీ, నిర్మలా సీతారామన్,చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపి,జీఎస్టీ తగ్గింపు పేదలకు – వరం అని విదేశీవస్తువులు వద్దువద్దు-స్వదేశీవస్తువులు ముద్దుముద్దే అనే నినాదాలుతో ఎన్డీయే కూటమి బీజేపీ,టీడీపీ,జనసేన నాయకులు,కార్యకర్తలు, అభిమానులతో మారుమ్రోగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్,రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం గతంలో నాలుగు స్లాబ్లుగా ఉన్న 5% 12% 18% 28% వాటిని రెండు స్లాబ్లుగా అంటే పేదల నిత్యవసర సరుకులుపై 0%, 5% 18%గా మరియు పాపం వస్తువులైనా ప్రజలకు హాని కలిగించే పోవ్వకు ఉత్పత్తులపై 40% జీఎస్టీగా సంస్కరణలు ప్రవేశ పెట్టిన నరేంద్ర మోదీ,నిర్మలా సీతారామన్,చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలుపుతూ కోలా ఆనంద్,సామంచి శ్రీనివాస్ మార్కెట్ వర్తకులు మరియు వినియోగదారులుతో ధన్యవాద తీర్మానాలు చేయడం జరిగినది. తదుపరి తల్లి పేరుతో ఒక చెట్టుముఖ్య అతిథి సామంచి శ్రీనివాస్,కోలా ఆనంద్ చేతుల మీదుగా మొక్కలు నాటడం జరిగినది.ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్,రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్,జిల్లా ప్రధాన కార్యదర్శి బీడీ బాలాజీ, జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, మండల అధ్యక్షులు పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి,టీడీపీ నేతలు మహబూబ్భాషా,పుష్పనాథ్,కొరియర్ రవి,నెల్లూరు సుబ్రమణ్యం,అడపాల శ్రీనివాసులు,నవాబ్,బీజేపీ నాయకులు జాన్ మధుకర్,శ్యాంచంద్ గెహ్లాట్,అన్నపూర్ణమ్మ,రాజా రాయల్,భీమవరం నరేష్తదితరులు పాల్గొన్నారు.


