జీఎస్టీ తగ్గింపు వల్ల నిరుపేద, మధ్యతరగతి వర్గాల వారికి ఒరిగిందేమీ లేదు… కామ్రేడ్ పండు గోల మణి
రైల్వే కోడూరు పట్టణం, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ పండుగోల మణి, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు మండల కార్యదర్శి కామ్రేడ్ దార్ల రాజశేఖర్, ఏఐవైఎఫ్ మండల నాయకులు ఫైజర్ విలేకరుల సమావేశం ఏర్పాటుచేసిన సందర్భంగా కామ్రేడ్ పండు గోల మణి మాట్లాడుతూ, రాష్ట్రంలో బిజెపి, తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలలు అధికారంలోకి వచ్చిన కాలంలో జిఎస్టి తగ్గింపు అమలుపరచడం న్యాయమేనని దీనిని అభినందిస్తున్నా విషయమేనని, కానీ ఈ జీఎస్టీ తగ్గింపు వల్ల బడుగు, బలహీన వర్గాల కు చెందిన పేద, మధ్య తరగతి వాళ్లకు ఒరిగిందేమీ లేదని పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలకు చెందిన టాటా, బిల్లా, అంబానీల కు చెందిన వారి కోసమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో బిజెపి ప్రభుత్వం జీఎస్టీ ని తగ్గించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, వ్యవసాయ, విద్య, వ్యాపార రంగాలకు చెందినవారికి రాష్ట్రంలో సూపర్ గిఫ్ట్ పేరుతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ధ్వజమెత్తారు, అంతేకాకుండా నిరుపేదలకు చెందిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు ఉపాధి పనులు చూపించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి అన్నారు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను పూర్తిగా ఈ రాష్ట్రంలో నీరు కార్చే పద్ధతుల్లో వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఉద్యమాలతో తగిన బుద్ధి చెప్తామన్నారు, నిరుపేదలు అనునిత్యం ప్రతిరోజు వాడుతున్న డీజల్, పెట్రోల్, వంటగ్యాసుతోపాటు, నిత్యవసర సరుకుల ధరలపై జిఎస్టి తగ్గిస్తే నిరుపేదలకు ఉపయోగపడుతుందని ఆయన గుర్తు చేశారు , కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తగ్గించిన జిఎస్టి కేవలం సాఫ్ట్వేర్ కంపెనీల వారికి ఉపయోగపడుతుంద ని దీనివల్ల నిరుపేదలకు ఒరిగిందేమీ లేదని, జీఎస్టీ తగ్గింపు పై సంకలు తట్టుకుంటున్న ఎన్డీఏ కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలకు తగిన బుద్ధి చెప్పే రీతిలో ఉద్యమాలకు శ్రీకారం చుడతామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వారు హెచ్చరించారు.


