Thursday, 5 February 2026
  • Home  
  • జిల్లా వ్యాప్తంగా యాచకులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, నేర చరిత్ర కలిగిన 18 మందిని గుర్తించిన తూర్పుగోదావరి జిల్లా పోలీసులు.
- క్రైమ్

జిల్లా వ్యాప్తంగా యాచకులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, నేర చరిత్ర కలిగిన 18 మందిని గుర్తించిన తూర్పుగోదావరి జిల్లా పోలీసులు.

జిల్లా అంతట ఘాట్లు మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో కొంతమంది యాచకులు ఎక్కడపడితే అక్కడ రోడ్లపై మద్యం సేవించి ఉంటూ నేరాలకు పాల్పడుతున్న నేపథ్యంలో, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్., గారి ఆదేశాల మేరకు రానున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని, వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 193 మందిని గుర్తించిన తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ… గుర్తించిన 193 మంది యాచకులలో 18 మందిపై నేర చరిత్ర ఉన్నట్లుగా గుర్తించామని, విచారణ అనంతరం వీరిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, మిగిలిన 175 మందికి కౌన్సిలింగ్ నిర్వహించి వారి స్వగ్రామాలకు పంపించడం జరిగిందని తెలియజేశారు. ఈ స్పెషల్ డ్రైవ్ ఇంకా కొనసాగిస్తామని, ఇకపై అటువంటి వ్యక్తులను గుర్తించినచో వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జిల్లా అంతట ఘాట్లు మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో కొంతమంది యాచకులు ఎక్కడపడితే అక్కడ రోడ్లపై మద్యం సేవించి ఉంటూ నేరాలకు పాల్పడుతున్న నేపథ్యంలో, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్., గారి ఆదేశాల మేరకు రానున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని, వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 193 మందిని గుర్తించిన తూర్పుగోదావరి జిల్లా పోలీసులు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ… గుర్తించిన 193 మంది యాచకులలో 18 మందిపై నేర చరిత్ర ఉన్నట్లుగా గుర్తించామని, విచారణ అనంతరం వీరిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, మిగిలిన 175 మందికి కౌన్సిలింగ్ నిర్వహించి వారి స్వగ్రామాలకు పంపించడం జరిగిందని తెలియజేశారు.

ఈ స్పెషల్ డ్రైవ్ ఇంకా కొనసాగిస్తామని, ఇకపై అటువంటి వ్యక్తులను గుర్తించినచో వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.