పున్నమి
ఖమ్మం జిల్లా ప్రతి నిధి
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈరోజు నాగుల చవితి ఉత్సాహంగా జరిగింది. వేకువజామున నుంచే మహిళలు, భక్తులు నాగేంద్రుని పుట్టల వద్ద బారులు తీరి పూజలు నిర్వహించారు. నాగరాజు దర్శనం కోసం భక్తులు చల్లగా చూడమని వేడుకోగా, మొక్కలు తీర్చుకున్నారు. భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు వైభవంగా సాగాయి.


