Sunday, 7 December 2025
  • Home  
  • *జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి ఆనంతో కలెక్టర్ సమావేశం*
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి ఆనంతో కలెక్టర్ సమావేశం*

*పత్రికా ప్రకటన*::::: *నెల్లూరు జిల్లాను అన్నిరంగాల్లో అగ్రపథంలో నిలుపుదాం* ➖ *మంత్రి ఆనం రామనారాయణరెడ్డి* *జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి ఆనంతో కలెక్టర్ సమావేశం* నెల్లూరు, అక్టోబర్ 24: అన్ని రంగాల్లో జిల్లాను అగ్రపథంలో నిలిపేందుకు అందరం కలిసి కృషి చేద్దామని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నూతన కలెక్టర్ హిమాన్షు శుక్లా కు సూచించారు. శుక్రవారం నెల్లూరు సంతపేటలోని దేవాదాయ శాఖా మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే గత ఐదు రోజులుగా జిల్లాలో కురిసిన భారీవర్షాల ప్రభావం, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకున్న తక్షణ చర్యల వివరాలను కలెక్టర్ మంత్రికి వివరించారు. ముఖ్యంగా భారీ వర్షాల నేపథ్యంలో సోమశిల ప్రాజెక్ట్ ,తాగునీటి సరఫరా, విద్యుత్ అంతరాయం లేకుండా తీసుకున్న చర్యలు, ఎప్పటికప్పుడు డ్రైన్స్ పూడికతీయడంతో వాహనదారులు, పాదచారులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టడం జరిగిందని కలెక్టర్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి ఆనం కలెక్టర్ కు సూచించారు.

*పత్రికా ప్రకటన*:::::

*నెల్లూరు జిల్లాను అన్నిరంగాల్లో అగ్రపథంలో నిలుపుదాం*

➖ *మంత్రి ఆనం రామనారాయణరెడ్డి*

*జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి ఆనంతో కలెక్టర్ సమావేశం*

నెల్లూరు, అక్టోబర్ 24: అన్ని రంగాల్లో జిల్లాను అగ్రపథంలో నిలిపేందుకు అందరం కలిసి కృషి చేద్దామని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నూతన కలెక్టర్ హిమాన్షు శుక్లా కు సూచించారు.

శుక్రవారం నెల్లూరు సంతపేటలోని దేవాదాయ శాఖా మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వారు జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే గత ఐదు రోజులుగా జిల్లాలో కురిసిన భారీవర్షాల ప్రభావం, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకున్న తక్షణ చర్యల వివరాలను కలెక్టర్ మంత్రికి వివరించారు.

ముఖ్యంగా భారీ వర్షాల నేపథ్యంలో సోమశిల ప్రాజెక్ట్ ,తాగునీటి సరఫరా, విద్యుత్ అంతరాయం లేకుండా తీసుకున్న చర్యలు, ఎప్పటికప్పుడు డ్రైన్స్ పూడికతీయడంతో వాహనదారులు, పాదచారులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టడం జరిగిందని కలెక్టర్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి ఆనం కలెక్టర్ కు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.