– డ్యూటీకి డోకా: వచ్చామా, వెళ్లామా అన్న చందంగా పనితీరు!
– గ్రామస్థాయి ‘పెద్దల’ మాటలకే విలువ!! సామాన్యుల పనులకు మోక్షమెక్కడ?
– బ్రోకర్లతో ములాఖత్‌లు, చిందులు, మందులు… పనులన్నీ గాలికే!
కామారెడ్డి, 17 అక్టోబర్. పున్నమి ప్రతినిధి :
కామారెడ్డి జిల్లా: జిల్లాలోని పలు గ్రామ పంచాయ తీలలో సెక్రెటరీల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘గ్రామానికి బాస్’గా ఉండాల్సి న పంచాయతీ సెక్రెటరీలు తమ ప్రాథమిక విధుల ను పూర్తిగా గాలికొదిలేశారనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి.వీరి నిర్లక్ష్యంతో గ్రామాల అభివృ ద్ధి, ప్రజల ముఖ్యమైన పనులు కుంటుపడుతు న్నాయని జిల్లా ప్రజలు ఆవేదన చెందుతున్నారు.పెద్దల మడులోత్తుతున్న ‘బాసులు’ సాధారణంగా, గ్రామ పంచాయతీ సెక్రెటరీ అంటే గ్రామ పరిపాల నకు కీలకమైన అధికారి. కానీ, కామారెడ్డి జిల్లాలో ని చాలా గ్రామాల్లో సెక్రెటరీల పనితీరు కేవలం ‘డ్యూటీకి వచ్చామా, పోయామా’ అన్న చందంగానే మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీరిపై గ్రామస్థాయి నాయకుల (లోకల్ లీడర్ల) ప్రభావం విపరీతంగా పెరిగిపోయిందని, సెక్రెటరీలు వారి మాటకు మడులోత్తుతున్నారని లోబడడం అత్యం త ప్రాధాన్యత ఇవ్వడం పై స్థానికులు చెబుతు న్నారు.
ఆస్తుల మార్పిడికి అడ్డుకట్ట.. నాయకుల మాటలే వేదం!
పంచాయతీ సెక్రెటరీల అత్యంత కీలకమైన విధులలో ఒకటి ఆస్తి మార్పిడికి సంబంధించినది. ముఖ్యంగా, వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులు, ప్లాట్లు, భూముల జాగాలు వంటి వాటిని ఎంక్వయి రీ చేసి, అర్హులైన కుటుంబ సభ్యుల పేరు మీద మార్పిడి చేయాలని అనేకమంది ప్రజలు అర్జీలు పెట్టుకుంటున్నారు. అయితే, సెక్రెటరీలు ఈ పను లను సకాలంలో చేయడం లేదని, బదులుగా ‘స్థాని క నాయకుల మాటలు విని’ అర్జీలను పక్కన పెడు తున్నారని లేదా ఆలస్యం చేస్తున్నారని ప్రజ లు ఆరోపిస్తున్నారు.నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగకపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని చెపుతున్నారు.
మురికి కాలువలు, రోడ్లు, తాగునీరు… పనులన్నీ గాలికే!
మంచినీటి సరఫరా, వీధి రోడ్ల నిర్వహణ, మురికి కాలువల శుభ్రత వంటి గ్రామానికి సంబంధించిన అత్యవసర పనులను సెక్రెటరీలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి.ముఖ్య మైన పనులు మూలనపడి ఉన్నప్పటికీ, వాటిపై దృష్టి సారించకుండా… సెక్రెటరీలు ఇతర అంశాలపై దృష్టి పెడుతున్నారని ప్రజలు వాపోతున్నారు.
బ్రోకర్లతో ‘చిందులు, మందులు’ గడిపిస్తున్న కాలం!
పని చేయాల్సిన సమయంలో సెక్రెటరీలు, గ్రామం లోని బ్రోకర్లు, మధ్యవర్తులకు ఎక్కువగా సమయం కేటాయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. “బ్రోకర్‌లతో కలిసి చిందేసి, మందేసి కాలం వెళ్ళదీ స్తున్నారే తప్ప! తమ పనులు చేసిపెట్టట్లేదని” జిల్లా ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి, కామారెడ్డి జిల్లాలో ని గ్రామ పంచాయతీ సెక్రెటరీల పనితీరుపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యతారహితంగా వ్యవహరి స్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే, గ్రామాల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


