Monday, 23 March 2026
  • Home  
  • జమాఆతె ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో “పొరుగువారి హక్కుల దేశవ్యాప్త ఉద్యమం” గోడ పత్రికా ఆవిష్కరించిన నంద్యాల అధ్యక్షులు అబ్దుల్ సమద్ ఇరుగుపొరుగు కలిసి ఉండటం ఐక్యతకు నిదర్శనం…సమద్
- E-పేపర్

జమాఆతె ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో “పొరుగువారి హక్కుల దేశవ్యాప్త ఉద్యమం” గోడ పత్రికా ఆవిష్కరించిన నంద్యాల అధ్యక్షులు అబ్దుల్ సమద్ ఇరుగుపొరుగు కలిసి ఉండటం ఐక్యతకు నిదర్శనం…సమద్

జమాఆతె ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నవంబర్ 21-30 వరకు నిర్వహించనున్న పొరుగువారి హక్కుల ఉద్యమాన్ని నంద్యాలలో స్థానిక అధ్యక్షులు అబ్దుల్ సమద్ గోడ పత్రికా, కరపత్రాలు ఆవిష్కరించి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సంధర్భంగా సమద్ మాట్లాడుతూ కుంచించుకు పోతున్న మానవ సంబంధాలు పెంపొందించుటకు, ఏకాంత జీవితానికి అలువాటు పడుతున్న ప్రజల్లో పరస్పర మానవ సంబంధాలు పెంచుటకు, ప్రజలలో సామాజిక చింతన కలిగించుటకు జమాఆతె ఇస్లామీ హింద్ సంస్థ దేశవ్యాప్తంగా నవంబర్ 21-30 మధ్య “పొరుగువారి హక్కుల ఉద్యమం” నిర్వహిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో ఇరుగుపొరుగు వారితో సస్సంబంధాలు , ఇచ్చిపుచ్చుకునే పూర్వ సాంప్రదాయాలు పరస్పర సహాయసహకారాలు, అన్యోనతలు కలిగించుటకు వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకుని పోతామని, ఖుర్ఆన్ తాకీదు చేసిన, ప్రవక్త ప్రవచనాలు ఉద్భోదించిన పోరుగువారి హక్కులు బాధ్యతగా స్వీకరించమని ముస్లిం సమాజాన్ని కోరుతామని తమ చుట్టుపక్కల ఉన్న అన్ని మతాలవారితో నిష్కల్మష సంబంధాలు కలిగిస్తాయని సమద్ తెలిపారు. ఇరుగు పొరుగు కలిసి ఉండటం ఐక్యతకు నిదర్శనం అన్నారు. ఈ ఉద్యమ నిర్వహణకు సి. యం. జూలియా కన్వీనర్ గా, మొహతరమా బేగం అమ్తుస్సలాం, అబ్దుల్ అలీం కో కన్వినర్ గా వ్యవహరిస్తారు అన్నారు జక్రియా మాట్లాడుతూ కళాశాలల్లో , పాఠశాల ప్రాంగణాల్లో పొరుగువారి బాధ్యతలు గుర్తు చేస్తామని,శుక్రవారం ప్రసంగాల్లో,కార్నర్ మీటింగుల్లో పొరుగవారి హక్కులు సంబంధం బాంధవ్యాల ఆవశ్యకత వివరిస్తామని, రెండు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నంద్యాల యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ విద్యార్థులనులు మేము సైతం అంటు కార్యక్రమంలో పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.