Wednesday, 25 March 2026
  • Home  
  • జనసేన నాయకుడు శ్రవణ్ కుమార్ కృషి ఫలించింది – వెన్నుపూస సమస్యతో బాధపడుతున్న నాగేశ్వరరావుకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.60,000 మంజూరు
- విశాఖపట్నం

జనసేన నాయకుడు శ్రవణ్ కుమార్ కృషి ఫలించింది – వెన్నుపూస సమస్యతో బాధపడుతున్న నాగేశ్వరరావుకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.60,000 మంజూరు

విశాఖపట్నం, అక్టోబర్ 27: విశాఖ నార్త్ నియోజకవర్గం 48వ వార్డ్ బర్మా క్యాంపు నివాసి మొల్లేటి నాగేశ్వరరావు వెన్నుపూస సమస్యతో బాధపడుతుండటంతో, ఆయనకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 60,000 ఆర్థిక సహాయం మంజూరైంది. ఈ సహాయం జనసేన పార్టీ 48వ వార్డ్ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ ఉప్పులూరి నిరంతర కృషి, చొరవ ఫలితంగా సాధ్యమైంది. ఆయన ఆధ్వర్యంలో బాధితుని పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా, తక్షణ స్పందనతో నిధులు మంజూరు అయ్యాయి. ఈ నిధులను సోమవారం విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, జనసేన నార్త్ ఇంచార్జ్ పసుపులేటి ఉషా కిరణ్, శ్రవణ్ కుమార్ ఉప్పులూరి చేతుల మీదుగా బాధితునికి అందజేశారు. ఈ సందర్భంగా బాధితుడు నాగేశ్వరరావు తన కుటుంబం తరఫున సహాయం అందించిన జనసేన నాయకత్వానికి, ముఖ్యంగా శ్రవణ్ కుమార్ కృషికి కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ సామాజిక సేవలో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని, ప్రజల సమస్యల పరిష్కారంలో పార్టీ కార్యకర్తలు చొరవ చూపడం గర్వకారణమని పార్టీ నాయకులు పేర్కొన్నారు.

విశాఖపట్నం, అక్టోబర్ 27:
విశాఖ నార్త్ నియోజకవర్గం 48వ వార్డ్ బర్మా క్యాంపు నివాసి మొల్లేటి నాగేశ్వరరావు వెన్నుపూస సమస్యతో బాధపడుతుండటంతో, ఆయనకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 60,000 ఆర్థిక సహాయం మంజూరైంది.

ఈ సహాయం జనసేన పార్టీ 48వ వార్డ్ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ ఉప్పులూరి నిరంతర కృషి, చొరవ ఫలితంగా సాధ్యమైంది. ఆయన ఆధ్వర్యంలో బాధితుని పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా, తక్షణ స్పందనతో నిధులు మంజూరు అయ్యాయి.

ఈ నిధులను సోమవారం విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, జనసేన నార్త్ ఇంచార్జ్ పసుపులేటి ఉషా కిరణ్, శ్రవణ్ కుమార్ ఉప్పులూరి చేతుల మీదుగా బాధితునికి అందజేశారు.

ఈ సందర్భంగా బాధితుడు నాగేశ్వరరావు తన కుటుంబం తరఫున సహాయం అందించిన జనసేన నాయకత్వానికి, ముఖ్యంగా శ్రవణ్ కుమార్ కృషికి కృతజ్ఞతలు తెలిపారు.

జనసేన పార్టీ సామాజిక సేవలో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని, ప్రజల సమస్యల పరిష్కారంలో పార్టీ కార్యకర్తలు చొరవ చూపడం గర్వకారణమని పార్టీ నాయకులు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.