Thursday, 5 February 2026
  • Home  
  • జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య చేత ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం – రైతుల సమస్యల పరిష్కారానికి కృషి
- ఎన్ టి ఆర్ జిల్లా

జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య చేత ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం – రైతుల సమస్యల పరిష్కారానికి కృషి

జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామంలో గోపాలకృష్ణ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో ముచ్చటించిన ఎమ్మెల్యే వారి సమస్యలను తెలుసుకున్నారు. తర్వాత ఆయన జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ను కలిసి రైతుల సమస్యలపై చర్చించారు. దీనిపై స్పందించిన కలెక్టర్, “రెండు మూడు రోజుల్లో తేమ శాతం ఆధారంగా మిల్లర్ల తో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటాం” అని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మాట్లాడుతూ, “రైతుల శ్రమకు తగిన మన్నన లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు ఎటువంటి ఇబ్బందు లు కలగకుండా సకాలంలో ధాన్యం కొనుగోలు జరుగుతుం దని” తెలిపారు. ఈ కార్యక్రమం లో జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు & గౌరవరం సొసైటీ చైర్మన్ కట్టా వెంకట నరసింహారావు, జగ్గయ్యపేట LSCS చైర్మన్ ధూళిపాళ్ల లక్ష్మణరావు, జగ్గయ్యపేట సొసైటీ చైర్మన్ యానాల గోపీచంద్, కాచవరం కెనాల్ చైర్మన్ కానూరి కిషోర్, గ్రామ నాయకులు, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామంలో గోపాలకృష్ణ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో ముచ్చటించిన ఎమ్మెల్యే వారి సమస్యలను తెలుసుకున్నారు.
తర్వాత ఆయన జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ను కలిసి రైతుల సమస్యలపై చర్చించారు. దీనిపై స్పందించిన కలెక్టర్, “రెండు మూడు రోజుల్లో తేమ శాతం ఆధారంగా మిల్లర్ల తో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటాం” అని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మాట్లాడుతూ, “రైతుల శ్రమకు తగిన మన్నన లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు ఎటువంటి ఇబ్బందు లు కలగకుండా సకాలంలో ధాన్యం కొనుగోలు జరుగుతుం దని” తెలిపారు. ఈ కార్యక్రమం లో జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు & గౌరవరం సొసైటీ చైర్మన్ కట్టా వెంకట నరసింహారావు, జగ్గయ్యపేట LSCS చైర్మన్ ధూళిపాళ్ల లక్ష్మణరావు, జగ్గయ్యపేట సొసైటీ చైర్మన్ యానాల గోపీచంద్, కాచవరం కెనాల్ చైర్మన్ కానూరి కిషోర్, గ్రామ నాయకులు, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.